Chiyaan Vikram in Mahesh Babu Movie: మహేష్ బాబు సినిమాలో విక్రమ్ ? స్పందించిన మేనేజర్

Chiyaan Vikram with Mahesh Babu:  మహేష్ బాబు, చియాన్ విక్రమ్ కాంబినేషన్‌లో ఏ సినిమా రాబోవట్లేదని... ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ అయినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని విక్రమ్ మేనేజర్ వెల్లడించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2022, 09:17 PM IST
  • మహేష్ సినిమాలో చియాన్ విక్రమ్...?
  • క్లారిటీ ఇచ్చిన చియాన్ విక్రమ్ మేనేజర్
  • మహేష్ సినిమాలో విక్రమ్ నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు నిరాధారమని వెల్లడి
Chiyaan Vikram in Mahesh Babu Movie: మహేష్ బాబు సినిమాలో విక్రమ్ ? స్పందించిన మేనేజర్

Chiyaan Vikram in Mahesh Babu Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో చియాన్ విక్రమ్ విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. దర్శక ధీర రాజమౌళి మహేష్ బాబుతో తెరకెక్కించబోయే మూవీలో విక్రమ్ విలన్‌గా కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా విక్రమ్ మేనేజర్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. 

మహేష్ బాబుకు సంబంధించిన ఏ ప్రాజెక్టులోనూ చియాన్ విక్రమ్ నటించట్లేదని ఆయన మేనేజర్ సూర్య నారాయణన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీనికి సంబంధించి సర్క్యులేట్ అవుతున్న రూమర్స్ అన్ని నిరాధారమని చెప్పారు. అలాంటి వార్త కథనాలను ప్రచురించే ముందు తమ నుంచి క్లారిటీ తీసుకోవాలని మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేశారు. 

ప్రస్తుతం మహేష్ బాబు పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉంది. త్రివిక్రమ్ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి ప్రాజెక్టును పట్టాలెక్కించవచ్చు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈ ఏడాది దసరాకు రాజమౌళి-మహేష్ కాంబో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. 

రాజమౌళి ఈ సినిమాను మల్టీ స్టారర్‌గా తెరకెక్కించే యోచనలో ఉండటంతో.. ఇందులో విలన్‌గా విక్రమ్‌ని అనుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా విక్రమ్ మేనేజర్ ఇచ్చిన క్లారిటీతో ఆ ప్రచారానికి తెరపడినట్లయింది. రాజమౌళి-మహేష్ సినిమా కోసం ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. అడ్వెంచర్ థ్రిల్లర్ తరహా కథను ఈ సినిమా కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

Also Read: Traffic Challans: హైదరాబాద్ వాహనదారులకు గుడ్ న్యూస్.. పెండింగ్ చలాన్లపై బిగ్ డిస్కౌంట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News