Amritha Aiyer Pics: పర్పుల్ శారీలో అమృత అయ్యర్.. బెంగూళూరు భామ అందాలు మరో లెవల్!

Amritha Aiyer Latest purple Saree Photos goes viral. అమృత అయ్యర్ పర్పుల్ శారీలో మెరిశారు. శారీలో అమ్మాయి గారు నవ్వుతూ చాలాచాలా అందంగా ఉన్నారు. అమృత అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 6, 2022, 02:50 PM IST
  • పర్పుల్ శారీలో అమృత అయ్యర్
  • బెంగూళూరు భామ అందాలు మరో లెవల్
  • అమ్మాయి గారిని ఇలా ఎప్పుడూ చూసుండరు
Amritha Aiyer Pics: పర్పుల్ శారీలో అమృత అయ్యర్.. బెంగూళూరు భామ అందాలు మరో లెవల్!

Actress Amritha Aiyer looks amazing in purple Saree: 1994 మే 14న బెంగూళూరులో అమృత అయ్యర్ జన్మించారు. బెంగూళూరులోని సెయింట్ జోసఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేశారు.

2012లో మలయాళ సినిమా ‘పద్మవ్యూహాం’తో అమృత అయ్యర్ సినీ కెరీర్ మొదలెట్టారు.  ఆపై చిన్నచిన్న పాత్రలు చేసినా.. 2018లో వచ్చిన తమిళ సినిమా ‘పదైవీరన్’ ద్వారా హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

కోలీవుడ్ స్టార్ హీరో 'దళపతి' విజయ్ నటించిన 'బిగిల్' సినిమాతో అమృత అయ్యర్ బాగా పాపులర్ అయ్యారు. రామ్ పోతినేని నటించిన 'రెడ్' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. 

యాంకర్ ప్రదీప్ మాచిరాజుతో కలిసి '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు అమృత అయ్యర్ మరింత దగ్గరయ్యారు. ఆ సినిమాలో అమ్మాయి గారిగా అందరి మనసుల్లో నిలిచిపోయారు. ఆపై శ్రీ విష్ణుతో కలిసి 'అర్జున ఫాల్గుణ' సినిమాలో నటించి మెప్పించారు. 

అమృత అయ్యర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన వ్యక్తిగత, సినిమాకు సంబందించిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తుంటారు.

తాజాగా అమృత అయ్యర్ పర్పుల్ శారీలో మెరిశారు. శారీలో అమ్మాయి గారు నవ్వుతూ చాలాచాలా అందంగా ఉన్నారు. అమృత అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు. 

Also Read: India Cricketers Birthday: ఒకేరోజు ఐదుగురు భారత క్రికెటర్ల పుట్టినరోజు.. షేక్ అవుతున్న సోషల్ మీడియా!  

Also Read: King Cobra Monkey Viral Video: బ్లాక్ కింగ్ కోబ్రా తోకను లాగిన కోతి.. చివరికి ఏమైందంటే?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News