Anushka Ghaati Poster: తెలుగు ప్రేక్షకులు స్వీటీ అని పిలుచుకునే హీరోయిన్ అనుష్క శెట్టి. పేరులానే తను కూడా నిజంగా స్వీటీ లానే ప్రవర్తిస్తూ ఉంటుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది తప్పకుండా ఫాలో అయ్యే హీరోయిన్లలో ఒకరు అని.. అనుష్క ని బయట చూసినవారు ఎవరైనా చెబుతారు. పర్సనల్ లైఫ్ లో ఇంత నెమ్మదిగా ఉండే ఈ హీరోయిన్ సినిమాల్లో మాత్రం ఎంతో పవర్ఫుల్ రోల్స్ ప్లే చేస్తూ ఉంటుంది.
ఈ క్రమంలో ఇప్పుడు తను రాబోయే చిత్రంలో మరోసారి అనుష్క ఎప్పుడూ కనిపించని క్యారెక్టర్.. లో కనిపించడానికి సిద్ధమైపోయింది. ఈరోజు స్వీటీ తన పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా.. అనుష్క శెట్టి పవర్ ఫుల్ పోస్టర్ని విడుదల చేశారు ఘాటి సినిమా యూనిట్.
VICTIM. CRIMINAL. LEGEND.
The Queen will now rule the #GHAATI ❤🔥
Wishing 'The Queen' #AnushkaShetty a very Happy Birthday ✨#GhaatiGlimpse Video today at 4.05 PM ✨
In Telugu, Tamil, Hindi, Kannada and Malayalam.#HappyBirthdayAnushkaShetty@DirKrish @UV_Creations… pic.twitter.com/jgZEBPU5gx
— UV Creations (@UV_Creations) November 7, 2024
యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు డైరెక్షన్ బాధ్యతలు వహిస్తుండగా..వంశీకృష్ణా రెడ్డి, రాజీవ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాగా ఇంతకుముందు అనుష్క.. క్రిష్ దర్శకత్వంలో వేదం చిత్రం చేసిన సంగతి తెలిసిందే. వేదం సినిమాలో ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ లో కనిపించి అప్పట్లో అందరిని ఆశ్చర్యపరిచింది ఈ హీరోయిన్. ఇక ఇప్పుడు.. రాబోయే చిత్రంలో మరింత డిఫరెంట్ గా చూపించనున్నారని అర్థమవుతోంది.
ఈరోజు అనుష్క పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్లో.. అనుష్క సిగరెట్ తాగుతూ.. ఎంతో కోపంగా కనిపించింది. అంతేకాదు ఈ సినిమా చిన్న వీడియోని ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేస్తామని కూడా ప్రకటించారు. ఇక ప్రస్తుతం ఈ పోస్టర్ తెగ వైరల్ అవుతూ అనుష్క అభిమానులను ఖుషి చేస్తోంది. బాహుబలి సినిమా తర్వాత అనుష్కకు చెప్పుకోదగిన బ్లాక్ బస్టర్ రాలేదు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ చిత్రం తప్పకుండా మరోసారి అనుష్కని పాన్ ఇండియా లెవెల్ లో నిలబెడుతుంది అని.. అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరి ఈ చిత్రం అనుష్క కెరియర్ లో ఎంతటి విజయం అందిస్తుందో చూడాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.
Also Read: బొప్పాయి ఫేస్‌మాస్క్‌తో బోలెడు ప్రయోజనాలు.. హిరోయిన్ మించిన అందం మీ సొంతం..
Also Read: ఈ 3 ఇంటి చిట్కాలతోనే తెల్ల వెంట్రుకల సమస్యకు ఈజీగా చెక్ పెట్టొచ్చు తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.