అలనాటి నటి కృష్ణకుమారి కన్నుమూత

అలనాటి నటి కృష్ణకుమారి(83) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరులో తుదిశ్వాస విడిచారు.

Last Updated : Jan 24, 2018, 04:42 PM IST
అలనాటి నటి కృష్ణకుమారి కన్నుమూత

అలనాటి నటి కృష్ణకుమారి(83) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. కృష్ణకుమారి సుమారు 110 చిత్రాల్లో నటించారు. తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విభిన్న పాత్రలతో మెప్పించి ప్రశంసలు అందుకున్నారు. 

కృష్ణకుమారి 'నవ్వితే నవరత్నాలు' చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు. పాతతరం కథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్నార్, జగ్గయ్య, శివాజీ గణేశన్ లాంటి అగ్రహీరోలందరి సరసన నటించారు. దేవదాసు, బందిపోటు, చిక్కడు దొరకడు చిత్రాలు ఆమెకు గుర్తింపును తీసుకొచ్చాయి. 20ఏళ్ల సినీప్రస్థాననంలో కృష్ణకుమారి సుమారు 110 చిత్రాలలో నటించగా.. ఎక్కువగా తెలుగు సినిమాల్లో నటించి మెప్పించారు. ఈమెకు చిన్నప్పటి నుంచి భానుమతి అంటే ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పారు. భానుమతితో కలిసి కులగోత్రాలు, పుణ్యవతి సినిమాల్లో నటించి సరదా తీర్చుకున్నారు. షావుకారు జానకి ఈమెకు పెద్దక్క. సినీ ఇండస్ట్రీలో మహానటి సావిత్రి ఈవిడను సొంత చెల్లెలిగా చూసుకొనేది. కృష్ణకుమారి మృతితో సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. 

Trending News