'బిగ్ బాస్ లో ఆ సీన్స్ జరిగాయి...సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి'..నటి షాకింగ్ కామెంట్స్

తెలుగు బిగ్ బాస్ షో పై సంచలన వ్యాఖ్యలు చేశారు నటి మాధవీలత. బిగ్ బాస్ హౌస్ లవర్స్ కు అడ్డాగా మారిందని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2021, 04:50 PM IST
'బిగ్ బాస్ లో ఆ సీన్స్ జరిగాయి...సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి'..నటి షాకింగ్ కామెంట్స్

Bigg Boss Telugu 5: బుల్లితెరపై బిగ్ బాస్ షో(Bigg Boss Telugu 5) మంచి టీఆర్పీ రేటింగ్స్ తో దూసుకుపోతుంది. ఇక మిగతా భాషల్లో మాదిరిగానే తెలుగు బిగ్‌బాస్‌ షోలో సైతం లవ్‌ ట్రాక్‌లు కామనే. రీసెంట్‌గా షణ్నూ-సిరిల వ్యవహారశైలిపై సోషల్‌ మీడియా(Social Media)లో విపరీతమైన రచ్చ జరిగింది. ఇద్దరూ బయట వేరేవాళ్లతో రిలేషన్‌ షిప్‌లో ఉన్నప్పటికీ హౌస్‌లో మాత్రం బాగా కనెక్ట్‌ అయిపోయారు. జెస్సీ(Jessi) వెళ్లిపోయాక వీరిద్దరి బంధం మరింత బలపడింది. ఎమోషనల్‌గా బాగా కనెక్ట్‌ అయిపోతున్నాం అంటూనే దూరంగా ఉండలేకపోతున్నారు. 

Also Read: స్టార్ హీరోతో కృతి శెట్టి లిప్ లాక్.. ఇపుడిదే హాట్ టాపిక్ గురూ!

బిగ్ బాస్ షోలో కొందరి కంటెస్టెంట్ల వ్యవహారశైలి ఏ మాత్రం నచ్చలేదంటూ..పలువురు నెటిజన్స్, సెలబ్రిటీలు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా బిగ్‌బాస్‌ షోలో జరుగుతున్న పరిణామాలపై నటి మాధవీలత(Actress Madhavi Latha) సోషల్‌ మీడియాలో వరుస కామెంట్లుతో దుమ్మురేపుతున్నారు. బిగ్‌బాస్‌ హౌస్‌ లవర్స్‌ అడ్డాగా మారిందని ఫైర్‌ అయ్యారు. 'బిగ్ బాస్‌లో రగులుతోంది మొగలిపొద సీన్స్ జరిగాయి..ఆ వీడియోలు, ఫోటోలు నా దగ్గరకు వచ్చాయి. కానీ వాటిని పబ్లిష్‌ చేయడం కల్చర్‌ కాదు' అంటూ మరో సంచలనానికి తెరదీసింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో మాధవీలత చేసిన ఈ కామెంట్స్‌ వైరల్ గా మారాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News