ముంబై: సినిమా అనగానే అదో రంగుల ప్రపంచమని, అంతా సజావుగా సాగిపోతుందని భావిస్తుంటుంటాం. సెలబ్రిటీలు నటించే సినిమాలు, ముఖ్యంగా బోల్డ్‌గా, అర్ధనగ్నంగా కనిపించే సీన్లు, ముద్దు సీన్లపై బోలెడు కామెంట్లు వస్తుంటాయి. అయితే ముద్దు సన్నివేశాల్లో నటించడం అంత తేలికకాదని, ఇబ్బంది ఉంటుందని.. భయానికి గురవుతామని చెబుతోంది బాలీవుడ్ భామ రిచా చద్దా. ఈ పేరు వినగానే ఈమెకేంటి బోల్డ్ లేడీ అనుకుంటారు. కానీ తాను కూడా అందరిలాంటి మహిళనేనని జాతీయ మీడియాతో ముచ్చిటిస్తూ కొన్ని విషయాలు షేర్ చేసుకుంది. తనకు బోల్డ్ అనే ట్యాగ్ మాత్రం తగిలించవద్దని అడుగుతోంది.
‘అభిమానులు, ప్రేక్షకులు అనుకున్నంత తేలికగా ముద్దు సీన్లు చిత్రీకరించలేం. కేవలం ప్రాక్టికల్‌గా కిస్సింగ్ సీన్లలో నటిస్తాం కానీ ఫీల్ అయ్యి చేయం. కొన్ని సందర్భాలలో ముద్దు సీన్లు షూట్ చేస్తుంటే ఇద్దరు ఇబ్బందిగా ఫీలవుతాం. కొన్ని సీన్లలో భయానికి లోనైన సందర్భాలున్నాయి. ముద్దు ఇస్తున్నట్లుగా నటిస్తూనే డైరెక్టర్ చెప్పిన విషయాన్ని గుర్తుంచుకుని ఆ పని కూడా సీన్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. పదే పదే కిస్సింగ్ సీన్ రీషూట్ చేయాల్సి వచ్చినా ఓపికగా వ్యవహరించాల్సి ఉంటుందని’ రిచా చద్దా చెప్పిన మాటలు బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి.
#NewProfilePic pic.twitter.com/fWtB83ytgn
— TheRichaChadha (@RichaChadha) February 4, 2020
కాగా, ఇటీవల కబడ్డీ నేపథ్యంలో వచ్చిన కంగనా రనౌత్ మూవీ ‘పంగా’లో రిచా చద్దా కోచ్ పాత్రలో కనిపించారు. కబడ్డీ మాజీ క్రీడాకారణి జయ నిగమ్ పాత్రను కంగనా పోషించగా.. జయ స్నేహితురాలు, కబడ్డీ కోచ్ మీను పాత్రకు చద్దా న్యాయం చేశారు. రిచా చద్దా ట్విట్టర్‌లో తాజా సినిమా లుక్‌ను పోస్ట్ చేసింది. న్యూ ప్రొఫైల్ పిక్ అని క్యాప్షన్ ఇచ్చింది. రిచా తర్వాతి ప్రాజెక్టు ఇదేనంటూ కామెంట్లు చేస్తున్నారు. రిచా లుక్ మాత్రం వైరల్ అవుతోంది.