హీరోయిన్ మూడో పెళ్లి గోల.. మధ్యలో మరొకరితో సహజీవనం!

Actress Vanitha | తమిళ సినీ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె ఎవరో కాదు... వనితా విజయ్ కుమార్. సీనియర్ నటుడు విజయ్ కుమార్-మంజుల దంపతుల వారసురాలిగా పరిశ్రమకు పరిచయమైన వనిత.. సినిమాల్లో కంటే వ్యక్తిగత జీవితంతోని వివాదాల వల్లే ఎక్కువ పాపులర్ అయిందని చెప్పుకోవచ్చు.

Last Updated : Jun 19, 2020, 03:15 AM IST
హీరోయిన్ మూడో పెళ్లి గోల.. మధ్యలో మరొకరితో సహజీవనం!

Actress Vanitha | తమిళ సినీ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె ఎవరో కాదు... వనితా విజయ్ కుమార్. సీనియర్ నటుడు విజయ్ కుమార్-మంజుల దంపతుల వారసురాలిగా పరిశ్రమకు పరిచయమైన వనిత.. సినిమాల్లో కంటే వ్యక్తిగత జీవితంతోని వివాదాల వల్లే ఎక్కువ పాపులర్ అయిందని చెప్పుకోవచ్చు. అందువల్లే ఆమెకు తమిళనాట బిగ్ బాస్ సీజన్ 3 ( Bigg Boss Tamil 3)లో పాల్గొనే అవకాశం కూడా దక్కిందంటుంటారు ఆమె గురించి బాగా తెలిసిన తమిళ తంబీలు. RRR trail shoot: రాజమౌళికి పోలీసులు షాక్ ఇచ్చారా ? )

వనిత విజయ్ కుమార్ ( Actress Vanitha Vijay Kumar ) వరుస పెళ్లిళ్ల విషయానికొస్తే... 2000 సంవత్సరంలో నటుడు ఆకాష్‌ని పెళ్లి చేసుకున్న వనిత.. 2005లో అతడితో పొసగడం లేదంటూ విడాకులు తీసుకుంది. వాళ్ల ఐదేళ్ల కాపురానికి జ్ఞాపకంగా ఓ కూతురు, కొడుకు పుట్టారు. ఆ తర్వాత 2007లో ఆనంద్ జయదర్శన్ ( Anand Jayavardhan) అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది కానీ ఆ కాపురం కూడా ఎంతో కాలం కొనసాగలేదు. ఓ కూతురు పుట్టిన తర్వాత ఆనంద్‌కి విడాకులు ఇచ్చేసింది.

ఆనంద్ జయదర్శన్‌ నుంచి డైవర్స్ తీసుకున్న తర్వాత.. రాబర్ట్ అనే కొరియోగ్రాఫర్‌తో వనిత డేటింగ్ చేస్తున్నట్టు కోలీవుడ్‌లో వార్తలు గుప్పుమన్నాయి. కొరియోగ్రాఫర్ రాబర్ట్‌తో సహజీవనం చేస్తున్న వనిత త్వరలోనే అతడిని పెళ్లి చేసుకోబోతోంది అంటూ కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కున్నాయి. కానీ వాళ్లందరికీ వనిత మళ్లీ షాక్ ఇచ్చింది. 

వనిత మూడో పెళ్లి చేసుకుంటుంది అని అందరూ ఎక్స్‌పెక్ట్ చేసిందే కానీ... ఈసారి అందరికీ తగిలిన షాక్ ఏంటంటే... వనిత వెడ్డింగ్ కార్డుపై రాబర్ట్ స్థానంలో పీటర్ పాల్ అనే మరో కొత్త వ్యక్తి వచ్చిచేరడమే!! అవును.. '' పీటర్ పాల్ వెడ్స్ వనిత '' అని రాసి ఉన్న వివాహ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవడం చూసి కోలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు ఆడియెన్స్ కూడా షాక్ తిన్నారట. వనితా విజయ్ కుమార్ రెండో పెళ్లికి, మూడో పెళ్లికి మధ్య ఒకరితో సహజీవనం కూడా చేసేసిందే అనేదే ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News