పందిపిల్లను సూపర్ స్టార్‌గా చూపించిన రవిబాబు

అదుగో మూవీ ట్రైలర్

Updated: Sep 12, 2018, 08:58 PM IST
పందిపిల్లను సూపర్ స్టార్‌గా చూపించిన రవిబాబు

విభిన్నమైన చిత్రాలకు పెట్టింది పేరైన నటుడు, దర్శకుడు రవిబాబు ఈసారి "అదుగో" అంటూ మరో విభిన్నమైన సినిమాతో ఆడియెన్స్ ముందుకొస్తున్నాడు. రవిబాబు నటిస్తూ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించింది. దసరా సెలవుల్లో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను నిర్మాతలు ఇవాళ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తోంటే, 3D ఫార్మాట్‌లో పందిపిల్లతో రవిబాబు సస్పెన్స్, యాక్షన్, కామెడి, మేజిక్ క్రియేట్ చేశాడనిపిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. అదుగో ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి.