Adipurush Movie: అంతా ఆదిపురుష్ మేనియా.. మొదటి రోజు వంద కోట్లు దాటేస్తుందా..?

Adipurush First Day Collection Expectations: ఇప్పుడు ఎక్కడ చూసినా ఆదిపురుష్ మేనియా కన్పిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రేపు జూన్ 16న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తొలిరోజే 100 కోట్లు దాటుతుందనే అంచనాలున్నాయి. ఇది సాధ్యమేనా..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 17, 2023, 07:37 PM IST
Adipurush Movie: అంతా ఆదిపురుష్ మేనియా.. మొదటి రోజు వంద కోట్లు దాటేస్తుందా..?

Adipurush First Day Collection Expectations: పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ క్రేజ్ పెరిగిపోతోంది. జూన్ 16 వతేదీ శుక్రవారం అంటే రేపు ప్రపంచవ్యాప్తంగా 7 వేల స్క్రీన్లతో మెగా రిలీజ్‌కు సర్వం సిద్దమైంది. టికెట్ల కోసం పెరుగుతున్న డిమాండ్ తొలిరోజే వందకోట్లు దాటుతుందనే అంచనాలను నిజం చేస్తుంటే..అసలు సాధ్యమేనా అనే ప్రశ్నలు కూడా విన్పిస్తున్నాయి. 

ఆదిపురుష్ ప్రపంచవ్యాప్తంగా రేపు 7 వేల స్క్రీన్లతో విడుదలవుతోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో మొదటి మూడ్రోజులు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అయిపోయాయి. ఆన్‌లైన్ సైట్స్ క్రాష్ అవుతున్నాయి. ఇప్పటి వరకూ 3 లక్షలకు పైగా టికెట్లు విక్రయమైపోయాయి. ఒక్క హైదరాబాద్‌లోనే తొలి రోజు వేయి షోలు ప్రదర్శించనున్నారు. దీనికి సంబంధించి 7 కోట్లకు పైగా వసూళ్లు ఉంటాయని తెలుస్తోంది. 

ఆదిపురుష్ సినిమాకు వస్తున్న క్రేజ్ చూస్తుంటే మొదటి రోజు కచ్చితంగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దాటేస్తుందని అంచనా. ఎంత లేదన్నా 125 కోట్ల వరకూ మొదటి రోజులు కలెక్షన్లు ఉండవచ్చని మార్కెట్ విశ్లేషకులు లెక్కేస్తున్నారు. బి, సి సెంటర్లు, చిన్న పట్టణాలు, గ్రామాల్లో డైరెక్ట్ కౌంటర్ సేల్స్ గణనీయంగా ఉంటాయి.

Also Read: Adipurush Full HD Print Leaked: ఆదిపురుష్ ఫుల్ హెచ్‌డి ప్రింట్ లీక్.. ఇంటర్నెట్లో ఫుల్ మూవీ

అందుకే ఆన్‌లైన్ టికెటింగ్ ఒక్కటే పరిగణలో తీసుకోలేమంటున్నారు. అన్నీ కలుపుకుంటే మొదటి రోజు కచ్చితంగా 100 కోట్లు దాటేయవచ్చనే తెలుస్తోంది. ఈ సినిమాకు హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో మంచి క్రేజ్ ఉంది కానీ తమిళం, మళయాలంలో ప్రస్తుతం అంత స్పందన కన్పించడం లేదు. హిట్ టాక్ వస్తే మాత్రం పరిస్థితిలో మార్పు ఉండవచ్చు.

ఆదిపురుష్ సినిమా బయ్యర్ల ఊహకు అందకుండా టికెట్ విక్రయాలు జరుగుతున్నాయి. అసలు టాక్ ఎలా ఉందో కూడా తెలియకుండానే మూడ్రోజుల వరకూ టికెట్లు చాలా ప్రాంతాల్లో అయిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అంచనా వేయవచ్చు. తెలుగు కంటే హిందీ రాష్ట్రాల్లోనే ఆదిపురుష్ సినిమా క్రేజ్ ఎక్కువగా ఉంది. ఈ సినిమాను హిందీ ప్రజలు సొంతం చేసుకున్నారా అనే సందేహాలొస్తున్నాయి. పీవీఆర్ సంస్థ ఇప్పటికే లక్ష టికెట్లు విక్రయించేసింది. తొలిరోజు కలెక్షన్లలో 40 శాతం ఉత్తరాది నుంచి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటున్నారు మార్కెట్ నిపుణులు. 

Also Read: Anni Manchi Sakunamule: ఓటీటీలోకి రాబోతున్న 'అన్నీ మంచి శకునములే'’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x