Adivi Sesh: కృష్ణ సినిమాకి ‌.. అడివి శేషు కార్ నెంబర్ కి.. సంబంధం ఏమిటంటే!

Adivi Sesh about Krishna: కమర్షియల్ సినిమాలు కాకుండా.. ఏదో కొత్తదనం ఉండే కథలను మాత్రమే ఎంచుకునే హీరో అడివి శేష్. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండానే.. ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటూ.. ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో.. మాట్లాడుతూ అడవి శేషు తన కారు నెంబర్ కి సూపర్ స్టార్ కృష్ణకి.. ఉన్న సంబంధం చెప్పారు. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 23, 2024, 10:38 PM IST
Adivi Sesh: కృష్ణ సినిమాకి ‌.. అడివి శేషు కార్ నెంబర్ కి.. సంబంధం ఏమిటంటే!

Adivi Sesh Movie Update: చిన్న బడ్జెట్ సినిమాలు తీస్తూ.. అందులో కూడా మంచి కథ ఉన్న స్క్రిప్ట్ ను మాత్రమే ఎంచుకుంటూ.. మంచి హిట్స్ అందుకున్నాడు యంగ్ హీరో అడివి శేష్. అడివి శేష్ సినిమా అంటేనే.. అందులో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది అని అభిమానులు ఫిక్స్ అయిపోతారు. శేష్ సినిమాలపై అంత నమ్మకం వచ్చేసింది. 

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. విలన్ గా కూడా నటించి క్షణంతో హీరోగా మారాడు.. అడివి శేష్. గూఢచారి, ఎవరు ఇలా సరికొత్త సినిమాలతో.. మంచి హిట్స్ అందుకున్న అడివి శేష్ ..మేజర్ సినిమాతో ప్యాన్ ఇండియా రేంజ్ స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అడివి శేష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో.. మాట్లాడుతూ అడివి శేష్ తన కార్ నంబర్ కి సూపర్ స్టార్ కృష్ణకి ఒక సంబంధం ఉందని చెప్పారు. "నాకు సూపర్ స్టార్ కృష్ణ గారు.. నటించిన గూఢచారి 116 సినిమా అంటే చాలా ఇష్టం. ఆ సినిమా తరువాతే తెలుగులో చాలా స్పై.. సినిమాలు వచ్చాయి. నా గూఢచారి సినిమాకి కూడా అదే ఇన్స్పిరేషన్. అందులో 116 నెంబర్ కూడా నాకు చాలా ఇష్టం. నా గూఢచారి సినిమాలో.. కూడా అది ఉంటుంది. నా కారు నంబర్ కి.. అదే నెంబర్ కావాలని తీసుకున్నాను" అని చెప్పుకొచ్చాడు అడివి శేష్. సూపర్ స్టార్ కృష్ణ గూఢచారి.. మీద ఉన్న అభిమానంతోనే తన కార్ నంబర్ 0116 గా పెట్టుకున్నట్లు తెలిపారు శేష్.

ఇక గూడచారి సినిమా.. మాత్రమే కాకుండా గూఢచారి చేసేవన్నీ స్పై లేదా సస్పెన్స్ థ్రిల్లర్.. సినిమాలే. ఆద్యంతం ప్రేక్షకులను కట్టి పడేసే స్క్రీన్ ప్లే తో అడివి శేష్ మంచి విజయాలు అందుకున్నాడు. ప్రస్తుతం గూఢచారి సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న గూఢచారి 2 తో బిజీగా ఉన్న శేష్ డెకాయిట్ సినిమాలో కూడా నటిస్తున్నాడు.

Read more: Elephant Attacks On Mahout: మావటిని రెండుకాళ్లతో పిండి పిండి చేసిన ఏనుగు.. షాకింగ్ వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Kerala newsElephant Attacks on MahoutAngry Elephant

Trending News