HIT 2 on OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన హిట్ 2 , ఎప్పుడు, ఎందులో

HIT 2 on OTT: టాలీవుడ్ హీరో అడవి శేష్ అభిమానులకు గుడ్‌న్యూస్. ఇటీవల విడుదలైన సినిమా హిట్ 2 త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. రెండు ప్రముఖ ఓటీటీ వేదికలు రైట్స్ కోసం పోటీపడ్డాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 20, 2022, 07:57 PM IST
HIT 2 on OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన హిట్ 2 , ఎప్పుడు, ఎందులో

ఇటీవల విడుదలైన టాలీవుడ్ సినిమా హిట్ 2 ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అటు భారీగా కలెక్షన్లు కూడా చేసి సంచలనం నమోదు చేసింది ఈ సినిమా. ఇప్పుడు త్వరలో ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమౌతోంది. 

టాలీవుడ్ అప్‌కమింగ్ హీరో అడవి శేష్ హీరోగా డిసెంబర్ 2న విడుదలై భారీ వసూళ్లు సాధించిన సినిమా హిట్ 2. హిట్ 2 ఓటీటీలో విడుదల ఖాయమైంది. రెండు ప్రముఖ ఓటీటీ వేదికలైన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్‌లు హిట్ 2 హక్కుల కోసం పోటీపడ్డాయి. చివరికి అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు హక్కుల్ని దక్కించుకుంది. జనవరి మొదటివారంలో ఓటీటీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కానుంది. 

అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన హిట్ 2 తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా విడుదలై మంచి కలెక్షన్లు సాధించింది. ఏడూరి జాన్ స్టీవర్ట్ సంగీతం అందించగా, తిపిర్నేని ప్రశాంతి ఈ చిత్రాన్ని నిర్మించారు. రావు రమేష్, భాను చందర్, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, శ్రీనాధ్ మాగంటి, కోమలి ప్రసాద్ ఇతర పాత్రలో కన్పించారు. 

Also read: Rishab Shetty Remuneration: 400 కోట్ల కలెక్షన్ల కాంతార మూవీకి రిషబ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News