Mehreen: ఎగ్ ఫ్రీజ్ చేయించిన టాలీవుడ్ హీరోయిన్.. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్..

Mehreen Pirzada : ఈమధ్య కెరియర్ మీద ఎక్కువగా దృష్టి పెట్టి ముందుకు నడుస్తున్న మహిళలు.. ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతిలో.. తమ అండాన్ని భద్రపరుచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఒక తెలుగు హీరోయిన్ కూడా ఈ జాబితాలో చేరింది. ఆమె మరెవరో కాదు మెహరీన్ పిర్జాదా.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 30, 2024, 05:29 PM IST
Mehreen: ఎగ్ ఫ్రీజ్ చేయించిన టాలీవుడ్ హీరోయిన్.. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్..

Mehreen Pirzada To Be Mom Soon: నాని హీరోగా నటించిన కృష్ణ గాడి వీర ప్రేమ కథ సినిమాతో.. టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైన మెహరీన్ పిర్జాదా.. ఆ తరువాత మహానుభావుడు, రాజా ది గ్రేట్ సినిమాలతో మంచి హిట్లు అందుకుంది. ఈ మధ్యనే ఎఫ్ 3 సినిమాతో కూడా మరొక హిట్ అందుకున్న మెహరీన్.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటూ.. తన వ్యక్తిగత జీవితం గురించి కూడా పోస్ట్ లు పెడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మెహరీన్ పెట్టిన ఒక పోస్ట్.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మధ్యనే తన అండాన్ని ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతిలో భద్రపరచుకున్న మెహరీన్.. తన జర్నీ గురించి సోషల్ మీడియాలో ఒక వీడియోని షేర్ చేస్తూ.. పెద్ద పోస్టు పెట్టింది. 

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

ఈమధ్య కరియర్ తో బిజీగా ఉన్న మహిళలు ముఖ్యంగా హీరోయిన్లు.. తమ అండాన్ని భద్రపరుచుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు సులువుగా పిల్లల్ని కనచ్చని, తమ అండలను ఇలా ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతిలో భద్రపరుచుకుంటున్నారు.  తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మృణాల్ ఠాకూర్ కూడా ఎగ్ ఫ్రీజ్ చేయించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది. తాజాగా మెహరీన్ ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకుని మరీ.. తన జర్నీని ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ ప్రక్రియకి వెళ్ళడానికి ముందు రెండు సంవత్సరాల పాటు.  తన మనసుని సిద్ధం చేసుకున్నట్లుగా చెప్పిన మెహరీన్.. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నట్లు ప్రకటించింది. 

"ఇంత పర్సనల్ విషయాన్ని అందరితో పంచుకోవాలా వద్దా అని చాలా ఆలోచించాను. కానీ నాలాంటి చాలామంది ఆడవాళ్ళకి.. భవిష్యత్తులో అయినా ఇది చాలా ఉపయోగపడుతుంది. టెక్నాలజీ సహాయంతో మన నిర్ణయాలు మనం తీసుకోగలుగుతున్నాం. తల్లి కావాలనేది నా కల. కానీ అది నిజం అవ్వడానికి ఇంకొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. అందుకే ఎగ్ ఫ్రీజ్ చేయించుకున్నాను. అసలే హాస్పిటల్స్ అంటే ఫోబియా ఉన్న నేను హార్మోన్ ఇంజక్షన్స్ కోసం హాస్పిటల్ కి వెళ్ళిన ప్రతిసారి కళ్ళు తిరిగి పడిపోయాను. కానీ ఈ ప్రక్రియకి అంత విలువ ఉందా అంటే.. కచ్చితంగా అవుననే చెబుతాను. నా జర్నీలో నా పక్కనే ఉంటూ నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన నా డాక్టర్ కి, మా అమ్మ కి నా ధన్యవాదాలు" అని చెప్పుకొచ్చింది మెహరీన్. 

ఇక మెహరీన్ ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియ లో భాగంగా పొట్టకి ఇంజక్షన్లు చేయించుకుంటూ.. సర్జరీకి సిద్ధమయ్యేటప్పటి వీడియో ను షేర్ చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మెహరీన్ తీసుకున్న ఈ మంచి నిర్ణయానికి అభిమానులు కూడా ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల పరంగా చూస్తే మెహరీన్ ప్రస్తుతం ఒక కన్నడ సినిమాతో బిజీగా ఉంది.

Also read: Janasena Glass Symbol: రెబెల్స్‌కు గాజు గ్లాసు గుర్తు, కూటమి అభ్యర్ధుల్లో ఆందోళన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News