Aha Video Crashed: అనుకున్నంతా అయింది.. పవన్ దెబ్బకు 'ఆహా' అనిపించారు!

Aha Video Crashed : బాలకృష్ణ హోస్టుగా ఆహా వీడియోలో ప్రసారం అవుతున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే వలన ఆహా వీడియో యాప్ క్రాష్ అయింది. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 11, 2023, 04:09 PM IST
Aha Video Crashed: అనుకున్నంతా అయింది.. పవన్ దెబ్బకు 'ఆహా' అనిపించారు!

Aha Video Crashed Due to Pawan Episode: బాలకృష్ణ హోస్టుగా ఆహా వీడియోలో ప్రసారం అవుతున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే ఒక ప్రోగ్రాం స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక సీజన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షోకి సంబంధించి రెండో సీజన్ కూడా ఘనంగా ప్లాన్ చేశారు. మొదటి ఎపిసోడ్ చంద్రబాబు లాంటి పొలిటికల్ లీడర్ తో ప్లాన్ చేయడంతో రెండవ సీజన్ మీద కూడా ఒకసారి అందరిలో ఆసక్తి ఏర్పడింది.

రెండో సీజన్లో ప్రభాస్ సహా పవన్ కళ్యాణ్ వంటి వాళ్లతో ఎపిసోడ్లు చేసి రిలీజ్ చేయడంతో ప్రేక్షకులలో ఈ షో మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సెకండ్ ఎపిసోడ్ ను ఆహా యాజమాన్యం రిలీజ్ చేసింది. వాస్తవానికి పదో తేదీన ఈ ఎపిసోడ్ రిలీజ్ చేస్తామని ప్రకటించినా సరే గతంలో మాదిరిగానే ఒకరోజు ముందుగానే విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుని రిలీజ్ చేసింది. అయితే రిలీజ్ చేసిన కొద్దిసేపటి వరకు బాగానే స్ట్రీమైనా సరే తర్వాత ఆహా యాప్ సహా వెబ్ వర్షన్ కూడా హ్యాంగ్ అవడం మొదలు పెట్టింది.

దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆహా యాజమాన్యం సారీ చెబుతూ ఒక ట్వీట్ చేసింది. ఈ ప్రోగ్రాం మీరు చూడలేకపోతున్నందుకు మమ్మల్ని క్షమించండి, మా యాప్ లో హెవీ ట్రాఫిక్ కారణంగా యాప్ ఇబ్బంది పడుతోంది. మేము ఆ ఇష్యూ సాల్వ్ చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం మమ్మల్ని మరికొద్ది సేపు భరించండి వీలైనంత త్వరగా ఆ ఎపిసోడ్ ని మీ ముందుకు తీసుకొస్తాం అంటూ ట్వీట్ చేసింది.

మొదటి భాగం అంతా పవన్ కళ్యాణ్ సినిమాలు గురించి మాట్లాడితే రెండో భాగంలో ఆయన రాజకీయాల గురించి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఈ నేపద్యంలోనే రెండవ ఎపిసోడ్ మీద అందరి ఫోకస్ నెలకొంది. వాస్తవానికి మొదటి ఎపిసోడ్ స్ట్రీమ్ అయినప్పుడు ఆహా ప్రత్యేక టీములను కూడా నియమించుకుంది. దీంతో కొంతమేర మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ సమయంలో ఇబ్బందులు లేకుండా బయటపడింది. అయితే ఇప్పుడు అశ్రద్ధ చేసిందో లేక గతంలో కంటే ఎక్కువ మంది ప్రోగ్రాం చూసేందుకు ఆసక్తి చూపించారో తెలియదు కానీ మొత్తం మీద యాప్ క్రాష్ అయింది.

ALso Read: Puri Jagannadh Movie: నక్క తోక తొక్కిన పూరీ జగన్నాధ్.. బాస్ తో సినిమా ఫిక్స్!

Also Read: Writer Padmabhushan Movie: రైటర్ పద్మ భూషణ్ మీద కాపీ ఆరోపణలు.. ఆ సినిమా నుంచి తెచ్చారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News