Agent Day 1 Collections అక్కినేని హీరోలకు ఇప్పుడు పరిస్థితి బాగా లేదనిపిస్తోంది. అటు నాగ చైతన్య థాంక్యూ డిజాస్టర్‌తో ఉన్నాడు. ఇటు అఖిల్ ఇప్పటికీ సరైన హిట్టు కొట్టలేక సతమతమవుతున్నాడు. లేక లేక మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమాతో పర్వాలేదనిపించాడు. అయితే ఆ మాత్రం వచ్చిన సక్సెస్‌ను అఖిల్ కాపాడుకోలేకపోయినట్టు కనిపిస్తోంది. ఏజెంట్ సినిమా కోసం మొదటి సారి యాక్షన్ మోడ్‌లోకి వచ్చాడు. అఖిల్ ఈ ఏజెంట్ కోసం కష్టపడి బాడీని పెంచేశాడు.
ఏజెంట్ కథ, కథనాలు, మేకింగ్, టేకింగ్ పరంగా బోల్తా కొట్టేసినట్టు రివ్యూలు, మౌత్ టాక్ కూడా బయటకు వచ్చింది. కేవలం అఖిల్ చేసే యాక్షన్ సీక్వెన్స్ సినిమాను నిలబెట్టలేవు కదా? కథ, కథనాలు సరిగ్గా ఉండాలి కదా? అని ఆడియెన్స్ అంటున్నారు. అయితే దీంతో అఖిల్ ఏజెంట్ సినిమాకు కలెక్షన్లు కరువయ్యాయి. మొదటి రోజు ఓ మోస్తరుగా కలెక్షన్లు వచ్చాయి. అయితే నేడు కలెక్షన్లు దారుణంగా పడిపోయే అవకాశం కనిపిస్తోంది. యాక్యుపెన్సీ దారుణంగా తగ్గినట్టు తెలుస్తోంది.
అఖిల్ ఏజెంట్ సినిమాకు దాదాపు 36 కోట్ల బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ఇక 37 కోట్లు వసూల్ చేస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. అయితే ఈ టాక్‌తో టార్గెట్ రీచ్ అవ్వడం కష్టంగానే అనిపిస్తోంది. మొదటి రోజు పట్టుమని పది కోట్ల గ్రాస్, ఐదు కోట్ల షేర్ కూడా రాబట్టలేకపోయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా దాదాపుగా 4.95 కోట్ల షేర్ వచ్చినట్టుగా ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. ఇక రెండో రోజు అయితే ఈ సినిమాకు మరింత దారుణంగా వచ్చేలా కనిపిస్తోంది.
Also Read: Kriti Sanon Sita Posters : అశోకవనంలో సీత.. ఆదిపురుష్ నుంచి కృతి సనన్ లుక్.. పిక్స్ వైరల్
అఖిల్ ఏజెంట్ సినిమాకు పాటలు, బీజీఎం ఇలా ఏ ఒక్క అంశం కూడా కలిసి రాలేదు. హీరోయిన్ సాక్షి అయితే మెయిన్ మైనస్‌గా నిలిచింది. సురేందర్ రెడ్డి టేకింగ్ మొదటి సారిగా జనాలను ఇరిటేట్ చేసింది. అఖిల్ లుక్స్ కూడా బాగా లేవు. కాకపోతే అఖిల్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, యాక్షన్ సీక్వెన్స్ మాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక అఖిల్ నెక్ట్స్ సినిమా సంగతులు ఏంటో తెలియాల్సి ఉంది.
Also Read: Rajinikanth Balakrishna : బాలకృష్ణను రజినీకాంత్ ట్రోల్ చేశాడా?.. ఆ మాటలకు అర్థం అదేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook