రజినీ 2.0 చిత్రంలో అక్షయ్ విలన్ కాదు..!

  

Last Updated : Nov 2, 2017, 05:23 PM IST
రజినీ 2.0 చిత్రంలో అక్షయ్ విలన్ కాదు..!

రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ "2.0" చిత్రంలో అక్షయ్ కుమార్ పోషిస్తున్న పాత్ర విలన్ కాదని తెలుస్తోంది. ఇటీవలే ఓ ప్రముఖ పత్రిక ఈ విషయం మీద కథనం రాస్తూ, అక్షయ్ ఈ చిత్రంలో విలన్ కాదని తెలిపింది. కథాపరంగా అక్షయ్ పోషిస్తున్న పేరు డాక్టర్ రిచర్డ్ అని... అది ఓ ఉదాత్తమైన పాత్ర అని తెలిపింది. అయితే ఆ రూపాన్ని బట్టి ప్రేక్షకులు విలన్ అని భ్రమపడే అవకాశముందని పేర్కొంది. ఇదే విషయాన్ని ఈ మధ్యనే అక్షయ్ వెల్లడించినట్లు ఆ పత్రిక తెలిపింది. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై 450 కోట్ల రూపాయలతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్రాండ్ ఆడియో రిలీజ్ వేడుక ఇటీవలే ఏ.ఆర్.రెహ్మాన్ ఆధ్వర్యంలో దుబాయ్‌లో జరిగింది. అమీ జాక్సన్ హీరోయిన్‌గా ఈ చిత్రాన్ని జనవరి 25వ తేదీన విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. తమిళం, హిందీలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగులో కూడా డబ్ కానుంది. 

 

Trending News