Allu Arjun: అల్లు అర్జున్ తో అట్లీ సినిమా క్యాన్సల్ అవ్వడానికి అసలు కారణం ఇదే..తెలిస్తే షాక్!

Allu Arjun Atlee Movie: పుష్ప 2 సినిమా తర్వాత.. అల్లు అర్జున్ టాలీవుడ్ డైరెక్టర్.. అట్లీ దర్శకత్వంలో.. ఒక సినిమా చేయాలి. కానీ ఆ సినిమా ఈ మధ్యనే క్యాన్సల్ అయింది. తాజాగా ఈ సినిమా ఎందుకు.. క్యాన్సిల్ అయింది అనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కారణంగానే అట్లీ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని.. కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 23, 2024, 10:22 PM IST
Allu Arjun: అల్లు అర్జున్ తో అట్లీ సినిమా క్యాన్సల్ అవ్వడానికి అసలు కారణం ఇదే..తెలిస్తే షాక్!

Allu Arjun Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2.. సినిమాతో బిజీగా ఉన్నారు. 2021లో విడుదలైన పుష్ప సినిమాకి.. రెండవ భాగంగా ఈ చిత్రం..తెరకెక్కనుంది. తెలుగులో మాత్రమే కాక.. పుష్ప సినిమా మిగతా భాషల్లో కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. 

ఇక పుష్ప పాత్రలో.. నట విశ్వరూపం చూపించిన అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. ఈ నేపథ్యంలో పుష్ప 2.. సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్.. అట్లీ.. దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. 

కానీ ఈ మధ్యనే ఆ సినిమా క్యాన్సిల్ అయినట్లుగా వార్తలు బయటకు వచ్చాయి. గీత ఆర్ట్స్ వారు.. ఈ సినిమాని నిర్మించాలి. అయితే అట్లీ ఎక్కువ రెమ్యూనరేషన్ కోరారని, దానికి గీత ఆర్ట్స్ వారు ఒప్పుకోకపోవడంతో సినిమా క్యాన్సిల్ అయిందని.. కొందరు కామెంట్లు చేశారు. 

అయితే మరోవైపు.. ఈ సినిమా క్యాన్సిల్ అయిందన్న వార్త బయటకు వచ్చి రెండు వారాలు కూడా కాలేదు. ఈలోపే అట్లీ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ తో.. సినిమా చేస్తున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. అంతేకాకుండా ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ తో పాటు.. మరొక స్టార్ హీరో కూడా ఉండబోతున్నారని టాక్. ఆ పాత్ర కోసం రన్వీర్ సింగ్ ను సంప్రదించారని తెలుస్తోంది.

అయితే తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ తో చేయాల్సిన కథే.. అట్లీ..సల్మాన్ ఖాన్ తో.. చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగా అట్లీ.. అల్లు అర్జున్ ని.. తనతో  పాటు మరొక స్టార్ హీరోని.. పెట్టాలని అడిగారని తెలుస్తోంది. కానీ అల్లు అర్జున్ మల్టీస్టారర్ సినిమా చేయడం.. ఇష్టం లేక పోవడంతో దానికి నో చెప్పారట. 

అందుకే అట్లీ ఈ సినిమా నుంచి తప్పుకున్నారని.. కొందరు ఊహగానాలు చేస్తున్నారు. అయితే ఇందులో నిజా నిజాలు.. మాత్రం ఇంకా తెలియాల్సి ఉన్నాయి. మరోవైపు అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా డిసెంబర్ 6న భారీ అంచనాల మధ్య విడుదల కాబోతోంది.

Read more: Elephant Attacks On Mahout: మావటిని రెండుకాళ్లతో పిండి పిండి చేసిన ఏనుగు.. షాకింగ్ వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Kerala newsElephant Attacks on MahoutAngry Elephant

 

 

Trending News