Pushpa తర్వాత డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీకి Allu Arjun ప్లాన్స్ ?

Allu Arjun plans for Bollywood entry after Pushpa movie: అల్లు అర్జున్.. తెలుగు ఆడియెన్స్‌కే కాదు.. దక్షిణాన మళయాళంలో, ఉత్తరాన హిందీ ఆడియెన్స్‌కి సుపరిచితమైన స్టైలిష్ స్టార్. కేరళలో అల్లు అర్జున్ సినిమాలు మళయాళం వెర్షన్‌లో థియేటర్లలోనే రిలీజైతే.. హిందీలో మాత్రం డబ్బింగ్ చిత్రాలతో (Allu Arjun Hindi dubbed movies) టీవీ, యూట్యూబ్ మాధ్యమాల ద్వారా అల్లు అర్జున్ సుపరిచితం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 1, 2021, 03:08 AM IST
Pushpa తర్వాత డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీకి Allu Arjun ప్లాన్స్ ?

Allu Arjun plans for Bollywood entry after Pushpa movie: అల్లు అర్జున్.. తెలుగు ఆడియెన్స్‌కే కాదు.. దక్షిణాన మళయాళంలో, ఉత్తరాన హిందీ ఆడియెన్స్‌కి సుపరిచితమైన స్టైలిష్ స్టార్. కేరళలో అల్లు అర్జున్ సినిమాలు మళయాళం వెర్షన్‌లో థియేటర్లలోనే రిలీజైతే.. హిందీలో మాత్రం డబ్బింగ్ చిత్రాలతో (Allu Arjun Hindi dubbed movies) టీవీ, యూట్యూబ్ మాధ్యమాల ద్వారా అల్లు అర్జున్ సుపరిచితం. ఇప్పుడిక పుష్ప లాంటి ప్యాన్ ఇండియా సినిమాతో ఈసారి ఇంకాస్త తన ఫ్యాన్ బేస్‌తో పాటు మార్కెట్ పరిధిని పెంచుకుంటున్న అల్లు అర్జున్.. త్వరలోనే ఓ స్ట్రెయిట్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నట్టు టాక్.

వాస్తవానికి అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ న్యూస్‌పై (Allu Arjun's Bollywood entry) టాక్ వినిపించడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో అనేకసార్లు ఈ అంశం సినీవర్గాల్లో చర్చకొచ్చింది. అయితే గతంలో ఎప్పుడూ అల్లు అర్జున్ ఈ విషయంలో అంత సీరియస్‌గా ఆలోచించలేదు కానీ ఈసారి మాత్రం బాలీవుడ్‌లో డైరెక్ట్ ఎంట్రీకి ఇదే కరెక్ట్ టైమ్ అని భావిస్తున్నాడనేది లేటెస్ట్ టాక్.

Also read : Mahesh Babu: బుర్రిపాలెంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ఏర్పాటు చేసిన మహేష్ బాబు

పుష్ప మూవీ రెండు భాగాల (Pushpa part 1, Pushpa part 2) షూటింగ్ పార్ట్ పూర్తయిన తర్వాత కొరటాల శివ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ ఓ సినిమా చేయాల్సి ఉంది. కాకపోతే కొరటాల శివకు ప్రస్తుతానికి వేరే కమిట్‌మెంట్స్ ఉండటం, కరోనా కారణంగా ప్రస్తుతం చేస్తున్న సినిమాల షెడ్యూల్స్ డిస్టర్బ్ అవడం వల్ల అల్లు అర్జున్ వేరే కథలు కూడా వింటున్నాడని.. అలాగే వీలైతే బాలీవుడ్‌లోనూ డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నాడని అల్లు అర్జున్ క్యాంప్ నుంచే బలమైన టాక్ వినిపిస్తోంది. 

Also read : Pawan Kalyan with Akira Nandan: అకీరా నందన్ s/o పవన్ కల్యాణ్.. లేటెస్ట్ ఫోటో వైరల్

తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద నిర్మాతగా పేరున్న అల్లు అరవింద్‌కి బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ మంచి పరిచయాలు ఉన్నాయి. అంతేకాకుండా గీతా ఆర్ట్స్, అల్లు అర్జున్‌తో (Allu Arjun) సినిమాలు చేసిన పూరి జగన్నాథ్ వంటి డైరెక్టర్స్ కూడా ఇప్పుడు బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్నారు. అలా తెలిసిన మార్గాల ద్వారా బాలీవుడ్‌పై ఫోకస్ చేసిన అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ కోసం ఏ డైరెక్టర్‌ని ఎంచుకుంటాడు, ఎలాంటి కథను ఎంచుకుంటాడనేదే ప్రస్తుతం ఆసక్తిరేకెత్తిస్తోంది.

Also read : Pranitha Subhash wedding: ప్రణీత సుభాష్‌కి పెళ్లయింది.. వరుడు ఎవరంటే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News