Pushpa The Rule Update : బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పుష్ప అప్డేట్ ఎప్పుడంటే?

Allu Arjun Birthday అల్లు అర్జున్ బర్త్ డే (ఏప్రిల్ 8) సందర్భంగా పుష్ప ది రూల్ అప్డేట్ రాబోతోంది. ఈ క్రమంలో మేకర్లు ప్రీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అప్డేట్ ఎప్పుడిస్తారో చెప్పే అప్డేట్‌ను ఇప్పుడు ఇచ్చారు. తాజాగా మేకర్లు వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 4, 2023, 07:46 PM IST
  • సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ సందడి
  • పుష్ప ది రూల్ అప్డేట్ వచ్చేసిందోచ్
  • కాన్సెప్ట్ టీజర్‌తో అంచనలు రెట్టింపు?
Pushpa The Rule Update : బన్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. పుష్ప అప్డేట్ ఎప్పుడంటే?

Pushpa The Rule Update అల్లు అర్జున్ బర్త్ డే (ఏప్రిల్ 8) సందర్భంగా సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ హల్చల్ చేయబోతోన్నారు. పుష్ప ది రూల్‌కు సంబంధించిన అప్డేట్ రాబోతోంది. సుకుమార్ ఈ మేరకు అదిరిపోయే ప్లాన్ వేశాడట. మొదటి పార్ట్ విషయంలోనూ ఇలానే చేశాడు. ఒక్క ముక్క డైలాగ్ పెట్టకుండా విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లతో ఓ వీడియోను వదిలారు. ఇప్పుడు కూడా అలాంటి ఓ వీడియోను వదలబోతోన్నట్టు తెలుస్తోంది. ఈ కాన్సెప్ట్ టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయాన్ని రేపు ప్రకటించబోతోన్నారట.

బుధవారం ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాబోతోన్నట్టుగా ప్రకటించారు. అయితే పుష్ప ది రూల్‌ విషయంలో సుకుమార్ ప్లానింగ్ వేరేలా ఉందట. ఈ కాన్సెప్ట్ టీజర్‌లో కేవలం బన్నీని మాత్రమే కాకుండా పార్ట్ 2 ఎలా ఉండబోతోందో చెప్పే హింట్ కూడా ఇవ్వనున్నాడని టాక్.

బన్నీ ఫ్యాన్స్‌కు మాత్రం ఫుల్ ట్రీట్ ఇచ్చేలా ఈ కాన్సెప్ట్ టీజర్ ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా వదిలిన పోస్టర్‌ను చూస్తే ఈ సారి కూడా యాక్షన్ సీక్వెన్స్‌లతోనే టీజర్‌ను నింపేలా కనిపిస్తోంది. ఏది ఏమైనా కూడా ఈ టీజర్‌తో పుష్ప పార్ట్ 2 మీద అంచనాలు పెంచేందుకు సుకుమార్ అండ్ టీం బాగానే కష్టపడుతోందట.

 

మొదటి పార్ట్ ఊహించని విజయం సాధించడంతో మైత్రీ, సుకుమార్, అల్లు అర్జున్ ఇలా అంతా కూడా రెండో భాగం మీద మరింత దృష్టి పెట్టారు. ఇక మొదటి పార్ట్ హిట్టవ్వడంతో దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం స్పెషల్‌ అట్రాక్షన్ అయిన సంగతి తెలిసిందే. దీంతో రెండో పార్ట్ కోసం దేవీ మరింతగా శ్రమిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్‌ వేసినట్టుగా సమాచారం అందుతోంది.

Also Read:  Devi Sri Prasad Marriage : ఇన్నాళ్లకు పెళ్లి చేసుకోబోతోన్న దేవీ శ్రీ ప్రసాద్.. ఎంత ఏజ్ గ్యాప్ అంటే?

Also Read: Samantha Ruth Prabhu: ఎవరు ఎవరితో చేసుకున్నా నాకేం బాధలేదు!.. నాగ చైతన్య - శోభిత డేటింగ్‌పై సమంత రియాక్షన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News