Varudu Heroine Bhanu Sri Mehata: పొద్దంతా రాద్దాంతం.. నైట్ ఒక పెగ్గు.. అల్లు అర్జున్ 'వరుడు' మూవీ హీరోయిన్ ట్విట్టర్ రచ్చ

Bhanu Sri Mehata Good night Post with Drink Glass:ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా ఫేమస్ అవుతారో చెప్పలేం. నిన్న అంతా కూడా వరుడు హీరోయిన్ వార్తల్లోకి ఎక్కేసింది. అది కూడా బన్నీ పేరు చెప్పుకుని ఫేమస్ అయింది. తనను బ్లాక్ చేశాడంటూ స్క్రీన్ షాట్ పెట్టడంతో వైరల్ అయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 20, 2023, 10:39 AM IST
  • ఒక్కసారిగా వెలుగులోకి భానుశ్రీ మెహతా
  • చాలా కాలానికి వార్తల్లో వరుడు హీరోయిన్
  • బన్నీ దెబ్బకు ట్రెండింగ్‌లో భానుశ్రీ
Varudu Heroine Bhanu Sri Mehata: పొద్దంతా రాద్దాంతం.. నైట్ ఒక పెగ్గు.. అల్లు అర్జున్ 'వరుడు' మూవీ హీరోయిన్ ట్విట్టర్ రచ్చ

BhanuSri Mehata Posted a pic with Alcohol Glass: వరుడు సినిమాతో పరిచయమైన భానుశ్రీ మెహతా కెరీర్ ఎలా నాశనం అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐదు రోజుల పెళ్లి నానా హడావిడి చేశారు. హీరోయిన్‌ను ఎక్కడా చూపించుకుండా దాచి పెట్టారు. అలా దాచి పెట్టడంతో హీరోయిన్ ఎంత అందంగా ఉంటుందో అని అంతా ఆశపడ్డారు. తీరా భానుశ్రీని చూశాకా.. ఈమె కోసమా? ఇంత హడావిడి చేసింది? అని జనాలు పెదవి విరిచారు. అలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్న ప్రేక్షకుడి కోపానికి వరుడు బలైంది.

సినిమా డిజాస్టర్‌ లిస్ట్‌లోకి ఎక్కేసింది. అలా భాను శ్రీ కెరీర్ పూర్తిగా పడిపోయింది. అయితే ఉన్నట్టుండి నిన్న అంతా కూడా భాను శ్రీ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. అల్లు అర్జున్ తనను ట్విట్టర్‌లో బ్లాక్ చేశాడంటూ వాపోయింది. స్క్రీన్ షాట్‌ను సైతం షేర్ చేసింది భాను శ్రీ. దీంతో బన్నీకి ఏమైంది? ఎందుకు ఇలా చేశాడంటూ నెటిజన్లు ఆరా తీశారు.

అయితే బన్నీ ఫ్యాన్స్ మాత్రం భాను శ్రీ మీద ఫైర్ అయ్యారు. నువ్ పదే పదే మెసెజ్‌లు పంపించి విసిగించి ఉంటావ్.. అందుకే నిన్ను బ్లాక్ చేసి ఉంటాడు అని ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అయితే ఆ తరువాత కొద్ది సేపటికే బన్నీ మళ్లీ తనను అన్ బ్లాక్ చేశాడంటూ ట్వీట్ వేసింది భాను శ్రీ. తానేమీ అల్లు అర్జున్‌ను టార్గెట్ చేసేందుకు ట్వీట్ చేయలేదని, తనను ఎప్పుడూ బ్లేమ్ చేయలేదని భాను శ్రీ చెప్పుకొచ్చింది.

ఇంతా చేసిన భాను శ్రీ చివరకు నైట్ అయ్యే సరికి ఓ పెగ్గేసినట్టుంది. అందరికీ గుడ్ నైట్ చెప్పింది.. ఈ రోజంతా కూడా వింతగా జరిగిందని, అంతా రోలర్ కోస్టర్ రైడ్‌లా అనిపించిందని, తానేమీ అల్లు అర్జున్ ఫ్యాన్స్‌ను హర్ట్ చేసేందుకు ఆ ట్వీట్ వేయలేదని చెప్పుకొచ్చింది. నేను కూడా బన్నీకి ఫ్యాన్‌నే. నా కెరీర్‌ను చూసి నేను నవ్వుకుంటాను.. నా బాధలు చూసి నేనే నవ్వుకుంటున్నాను.. ప్రేమను పంచుదాం.. ద్వేషాన్ని వద్దు అంటూ భాను శ్రీ ట్వీట్ వేసింది.

Also Read:  Allu Arjun Telugu Pride : బన్నీ పెట్టిన మంట.. ట్విట్టర్‌లో ఫ్యాన్ వార్.. రెచ్చిపోతోన్న మెగా, నందమూరి ఫ్యాన్స్

Also Read: Anasuya Bharadwaj Family : ఫ్యామిలీతో కలిసి చిల్.. వీకెండ్‌లో అనసూయ సందడి.. పిక్స్ వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News