Ram Vriksha Gaur: చిన్నారి పెళ్లికూతురు డైరెక్టర్‌కు కరోనా కష్టాలు

బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) సీరియల్ డైరెక్టర్‌ రామ్ వృక్ష గౌర్ (Ram Vriksha Gaur) రోడ్డు పక్కన కూరగాయలు అమ్మడం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.

Last Updated : Sep 28, 2020, 06:15 PM IST
Ram Vriksha Gaur: చిన్నారి పెళ్లికూతురు డైరెక్టర్‌కు కరోనా కష్టాలు

కరోనా వైరస్ మహమ్మారి అన్ని రంగాల వారిని కష్టాల్లోకి నెట్టింది. పనులు నిలిచిపోవడం, ప్రాజెక్టులు ఆగిపోవడం లాంటి కారణాలతో ఎటుచూసిన పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతోంది. టీవీ సీరియల్స్, సినిమాల షూటింగ్‌లు ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకపోవడంతో బతుకుదెరువు కోసం ఓ సెలబ్రిటీ కూరగాయలు అమ్ముతూ కనిపించాడు. బాలికా వధు (చిన్నారి పెళ్లికూతురు) సీరియల్ డైరెక్టర్‌ రామ్ వృక్ష గౌర్ (Ram Vriksha Gaur) రోడ్డు పక్కన కూరగాయలు అమ్మడం చూసి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. ICMR Vaccine Website: ఐసీఎంఆర్ కరోనా వ్యాక్సిన్ వెబ్‌సైట్ ప్రారంభం

వాస్తవానికి రామ్ వృక్ష గౌర్‌ (Chinnari Pellikuthuru director Ram Vriksha Gaur)కు ఓ సినిమా ఆఫర్ వచ్చింది. కొన్ని రోజుల సినిమా చేద్దామని షెడ్యూల్ చెప్పారు. ఖాళీ టైమ్ దొరికిందని స్వస్థలం ఆజంఘడ్‌కు రాగా.. అంతలోనే లాక్‌డౌన్ ప్రకటించారు. కొన్ని రోజుల తర్వా నిర్మాత తనకు ఫోన్ చేసి ఏడాది పాటు షూటింగ్ కష్టమేనని చెప్పారు. దీంతో ఏం చేయాలో నాకు పాలుపోలేదు. Sanju Samson: సిక్సర్ల సీక్రెట్ వెల్లడించిన రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్

ఇళ్లు గడవాలంటే ఏదైనా చేయాలని ఆలోచించాను. అప్పుడు మా నాన్న చేసే కూరగాయల వ్యాపారం గుర్తొచ్చింది. తోపుడు బండి తీసుకుని రోజూ కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నానని అసిస్టెంట్ డైరెక్టర్ తన పరిస్థితి వివరించాడు. ఈ పని చేస్తున్నందుకు ఏ మాత్రం బాధపడటం లేదని, పరిస్థితులకు తగ్గట్లుగా ఉండటమే జీవితం అవుతుందని చెప్పుకొచ్చాడు. SBI Warns Customers: ‘వాట్సాప్‌లో ఒక్క తప్పు చేస్తే మీ బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీ’

 

Trending News