Amala Paul`s divorce : అమలాపాల్ విడాకులకు ధనుష్ కారణమా ?

అమలాపాల్ విడాకులకు ధనుష్ ఆమె చేత సినిమాలు చేయించడమే కారణమంటూ ఇటీవల ఆమె మాజీ భర్త విజయ్ తండ్రి అళగప్పన్ ఆరోపించడం తమిళ సినీవర్గాల్లో సంచలనం సృష్టించింది.

Last Updated : Feb 18, 2020, 05:25 PM IST
Amala Paul`s divorce : అమలాపాల్ విడాకులకు ధనుష్ కారణమా ?

అమలాపాల్ విడాకులకు ధనుష్ ఆమె చేత సినిమాలు చేయించడమే కారణమంటూ ఇటీవల ఆమె మాజీ భర్త విజయ్ తండ్రి అళగప్పన్ ఆరోపించడం తమిళ సినీవర్గాల్లో సంచలనం సృష్టించింది. పెళ్లి తర్వాత అమలా పాల్ సినిమాలు చేయకూడదని విజయ్-అమలాపాల్ ఒప్పందం చేసుకున్నప్పటికీ.. ధనుష్ ఆమెను అతడు నటించిన అమ్మ కనక్కు, విఐపి 2 చిత్రాల్లో తీసుకున్నాడని.. విజయ్-అమలా పాల్ విడిపోవడానికే అదే ప్రధాన కారణమని ఇటీవల అళగప్పన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అళగప్పన్ చేసిన ఈ ఆరోపణల అనంతరం.. అమలాపాల్ విడాకులు తీసుకోవడానికి ధనుషే కారణమంట అనే ప్రచారం కోలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. 

ధనుష్ పేరు మీడియాలో మార్మోగిపోతుండటంపై తాజాగా అమలాపాల్ స్పందిస్తూ.. అతడిని ఈ వివాదంలోకి లాగొద్దని స్పష్టంచేసింది. విజయ్‌తో తాను విడిపోయిన మూడేళ్ల తర్వాత జరుగుతున్న ఈ ప్రచారంలో నిజం లేదని అమలా పాల్ తేల్చిచెప్పింది. తాను, విజయ్ విడిపోవడం పూర్తిగా తాను మాత్రమే తీసుకున్న నిర్ణయమని... అందుకు వేరెవ్వరినీ బాధ్యులను చేయొద్దని హెచ్చరించింది. ధనుష్ తన శ్రేయోభిలాషి, మంచి స్నేహితుడు అని అమలాపాల్ క్లారిటీ ఇచ్చింది. అమ్మడు ఇచ్చిన ఈ క్లారిటీతోనైనా ధనుష్‌పై వస్తోన్న ఆరోపణలకు తెరపడుతుందో లేదో మరి.

ఇక అమలపాల్ లేటెస్ట్ చిత్రాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె ఓ బయోపిక్‌లో నటిస్తోంది. బాలీవుడ్ నటి పర్వీన్ బాబీ రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రానికి అమలాపాల్ సైన్ చేసింది. మహేష్ భట్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో అమలాపాల్ పలు బోల్డ్‌ సీన్స్ చేయడానికి రెడీ అయినట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  

Trending News