"నేను అబ్రంకు పీచు మిఠాయి కొనిచ్చాను. అది తీసుకున్న వాడి ఆనందం వెలకట్టలేనిది" అని బిగ్ బీ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. ఇంతకీ ఎవరీ అబ్రం అనేగా మీ డౌట్? అబ్రం బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కొడుకు.
వివరాల్లోకి వెళితే... బిగ్ బీ మనవరాలు, అభిషేక్- ఐశ్వర్యల గారాలపట్టి ఆరాధ్య పుట్టినరోజు వేడుకలకు షారుఖ్ ఖాన్ తన కొడుకు అబ్రంతో కలిసి వచ్చాడు. షారుఖ్- బిగ్ బీ ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో అబ్రం పీచు మిఠాయి కావాలని అడిగాడట. అప్పుడు షారుఖ్ తో ఉన్న బిగ్ బీ పక్కనే ఉన్న స్టాల్ వద్దకు వెళ్లి అబ్రంకు పీచు మిఠాయి కొనిచ్చాడట. ఇదే విషయాన్ని అమితాబ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు. "అబ్రం.. జూనియర్ షారుఖ్ పీచు మిఠాయి కోన్ కావాలని అడిగాడు. అప్పుడు మేమిద్దరం స్టాల్ వద్దకు వెళ్లి కోన్ తయారు చేయించి అతనికి ఇచ్చాము. అది తీసుకున్న వాడి ఆనందం వెలకట్టలేనిది" అన్నారు. ఈ ట్విట్టర్ పోస్ట్ పై షారుఖ్ కూడా స్పందించారు. " థాంక్స్ సార్. ఈ మూమెంట్ ని తను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాడు. మిమ్మల్ని టి.వి.లో చూస్తున్నప్పుడు మీరు నా తండ్రి అని వాడు భావిస్తాడు"అని పేర్కొన్నారు.
T 2716 - And as for this little bundle .. he wanted the fluffy 'buddhi ka baal' cone .. so we took him to the stall made one for him and the joy of getting it is just priceless .. Abram, jr Shahrukh .. delectable !! pic.twitter.com/8SMF9YsH7p
— Amitabh Bachchan (@SrBachchan) November 19, 2017