ట్విటర్ ట్రోల్స్‌కి ధీటైన జవాబిచ్చిన అమితాబ్ బచ్చన్

ఈ నేరం ఇకపై కూడా చేస్తూనే వుంటా : అమితాబ్

Last Updated : Feb 7, 2018, 06:17 PM IST
ట్విటర్ ట్రోల్స్‌కి ధీటైన జవాబిచ్చిన అమితాబ్ బచ్చన్

అమితాబ్ బచ్చన్ పలువురు బిగ్‌బాస్ 11 సీజన్ కంటెస్టెంట్స్‌ని ఫాలో అవడం గమనించిన కొంతమంది నెటిజెన్స్.. "అయ్యో అమితాబ్ ట్విటర్ ఎకౌంట్ హ్యాక్ అయినట్టుంది. లేకపోతే బిగ్ బి, మెగాస్టార్ అమితాబ్ వాళ్లను ఫాలో అవడం ఏంటి" అని ఆశ్చర్యం వ్యక్తంచేస్తూ పలు ట్వీట్స్ పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. నెటిజెన్స్ పోస్ట్ చేసిన ట్వీట్స్ చూసి ఇబ్బిందికిగురైన అమితాబ్.. వారికి తనదైన స్టైల్లోనే ధీటైన జవాబు ఇచ్చారు. 

 

"తాను చాలామందిని ఫాలో అవుతుంటాను. కానీ తన ఎకౌంట్ హ్యాక్ అయిందని కొంతమంది లేనిపోని సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. ఒకవేళ వారిని ఫాలో అవడమే తాను చేసిన నేరం అయితే, ఈ నేరం ఇకపై కూడా చేస్తూనే వుంటాను" అని ట్వీట్ చేసి సదరు నెటిజెన్స్ నోరు మూయించారు అమితాబ్. 

 

ఇదిలావుంటే, అమితాబ్ చేసిన ట్వీట్‌కి బిగ్ బాస్ 11 సీజన్ కంటెస్టెంట్ ప్రియాంక్ శర్మ ఆనందం వ్యక్తం చేసింది. ఇది సీనయర్ బచ్చన్ తమకి ఇచ్చిన గౌరవంగా భావిస్తున్నానని ఆయనపట్ల తన కృతజ్ఞతాభావాన్ని చాటుకుంటూ ఓ ట్వీట్ చేసిందామె.

Trending News