Anandha Kannan dies of cancer: ఆనంద కన్నన్ ఇక లేరు. తమిళనాట ప్రముఖ నటుడిగా, ఫేమస్ వీడియో జాకీగా గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ కన్నన్ గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఆనంద కన్నన్ అకాల మరణంపై తమిళ సినీ ప్రముఖులు, అతడి సన్నిహిత మిత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కన్నన్‌తో తమకు ఉన్న అనుబంధాన్ని, స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ కన్నన్ ఆత్మశాంతి కోసం ప్రార్థిస్తున్నారు.
A great friend a great human is no more!! #RIPanandakannan my deepest condolences pic.twitter.com/6MtEQGcF8q
— venkat prabhu (@vp_offl) August 16, 2021
కోలీవుడ్‌లో (Kollywood) నటుడిగా సినీ ప్రస్థానం మొదలుపెట్టి ఆ తర్వాత సింగపూర్ వసంతం టీవీ షోతో హోస్టింగ్‌లోకి అడుగుపెట్టారు. అలా హోస్టింగ్ ప్రారంభించిన ఆనంద కన్నన్ 1990-2000 దశకంలో ఫేమస్ వీజేగా పేరు సంపాదించుకున్నారు.
Those wer the times wen u hardly had any music channels completely dedicated to Tamil Songs..and then came @SunMusic and some young adults whom each one of us could relate to..Ananda Kannan was top on that list..90s kids favourite VJ..#RIPanandakannan #anandakannan#sunmusic pic.twitter.com/PMW5DSyUhM
— CL Ramakrishnan (@kishen05journo) August 16, 2021
అనతికాలంలోనే ఎంతో మంది సినీ ప్రముఖులకు దగ్గరైన ఆనంద్ కన్నన్ (Anandha Kannan passes away) ఇక లేరని తెలిసి పలువురు సినీ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Great friend and great human is no more and such an young age he left us and will pray for his soul and more strength to his family 🙏 #ripanandakannan https://t.co/XFuEwY6NIW
— RJ Dheena (@dedeena) August 16, 2021
Also read : Anupam Shyam's death: అనుపమ్ శ్యామ్ కన్నుమూత: ఎవరు ఈ అనుపమ్ శ్యామ్.. ఫోటోగ్యాలరీ
'వీ ఆర్ సింగపూరియన్స్' అనే టీవీ షోను సవాల్ సింగపూర్ (Savaal Singapore show) షో పేరిట తమిళంలో రూపొందించగా ఆ టీవీ షోను ఆనంద్ కన్నన్ సక్సెస్‌ఫుల్‌గా హోస్టింగ్ చేశారు. ఆ టీవీ షోతో ఆయనకు వీజేగా మంచి గుర్తింపు లభించింది.
Rest in peace dear pic.twitter.com/jkHBeYmoQh
— RK SURESH (@studio9_suresh) August 16, 2021
ఆనంద్ కన్నన్‌తో (Anandha Kannan's death) తమ అనుబంధాన్ని, జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్న సినీ ప్రముఖులు.. ఆయన కుటుంబసభ్యులకు తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
Also read : Saranya Sasi dies of cancer: క్యాన్సర్‌తో పోరాడుతూ నటి శరణ్య శశి మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook