Mahesh Babu: ట్రెండ్ క్రియేట్ చేస్తున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులు

Mahesh Babu Latest Updates; సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమా సర్కారు వారి పాట. తొలిసారిగా కీర్తి సురేష్, మహేష్ బాబు జోడీగా కనిపించనున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని తెలిసిందే.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 25, 2021, 02:26 PM IST
  • మహేశ్‌‌ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్ అప్‌డేట్ వచ్చేసింది
  • పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న మూవీ ‘సర్కారు వారి పాట’
  • తొలుత నిర్ణయించిన ప్రకారం నేడు సర్కారు వారి పాట షూటింగ్ దుబాయ్‌లో ప్రారంభమైంది
Mahesh Babu: ట్రెండ్ క్రియేట్ చేస్తున్న సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులు

Sarkaru Vaari Paata Movie Shooting Starts In Dubai: టాలీవుడ్ సూపర్‌‌స్టార్‌ మహేశ్‌‌ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్ అప్‌డేట్ వచ్చేసింది. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న మూవీ ‘సర్కారు వారి పాట’. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నేడు సర్కారు వారి పాట షూటింగ్ దుబాయ్‌లో ప్రారంభమైంది. 

ఈ విషయాన్ని మూవీ యూనిట్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. ‘ది యాక్షన్ అండ్ ది యాక్షన్ బిగిన్స్’ అనే క్యాప్షన్‌తో 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్ తమ ట్విట్టర్‌లో ఓ వీడియోను షేర్‌ చేశాయి. #SarkaruVaariPaataShuru అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మహేష్ బాబు(Mahesh Babu) ఫ్యాన్స్ ఈ వీడియోను లైక్ చేయడంతో పాటు రీట్వీట్లు చేసి వైరల్ చేస్తున్నారు.

Also Read: Mahesh Babu: ఫ్యామిలీతో దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌ వెకేషన్‌లో మహేష్ బాబు  

 

 

 

14 రీల్స్ ప్లస్, జీఎంబీ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారని తెలిసిందే. ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. టాలీవుడ్(Tollywood Latest Updates) మూవీ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశాడు తమన్. నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంటలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మహేష్ బాబును డైరెక్ట్ చేయడంపై దర్శకుడు పరశురామ్ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. తన కల నిజమైందని పేర్కొన్నాడు.

Also Read: EPF Balance Check: ఈపీఎఫ్ఓ ఖాతాల్లోకి EPF Interest జమ, మీ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News