Animal Movie: డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీసులో కలెక్షన్ల వర్షం కురిపించిన సందీప్ రెడ్డి-రణబీర్ కపూర్ సినిమా యానిమల్ పంచాయితీ కోర్టుకు చేరింది. మరి కొద్దిరోజుల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుండగా సినిమా సహ నిర్మాత స్టే కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.
అర్జున్ రెడ్డి ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రణబీర్ కపూర్ - రష్మికా మందన్నాలతో తెరకెక్కించిన యానిమల్ సినిమా బాక్సాఫీసులో ఓ సంచలనంగా మారింది. ఈ సినిమా భారీ కలెక్షన్ల సునామీ సృష్టించింది. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ జనవరి 26న స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమౌతోంది. సరిగ్గా ఈ సమయంలో ఓటీటీ స్ట్రీమింగ్ నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించిన సినీ వన్ స్డూడియోస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ సినిమా విషయంలో మ్యూజిక్ కంపెనీ టి సిరీస్ తమతో కుదుర్చుకున్న ఒప్పందం ఉల్లంఘనకు గురైందని, యానిమల్ సినిమాలో 35 శాతం ప్రోఫిట్ షేర్, మేథో సంపత్తి హక్కులు ఉన్నాయని సినీ వన్ స్డూడియోస్ పిటీషన్ దాఖలు చేసింది. ప్రోఫిట్ షేరింగ్ విషయంలో టి సిరీస్ ఒప్పందాన్ని గౌరవించలేదని ఆరోపించింది. యానిమల్ సినిమాకు సీక్వెల్‌గా యానిమల్ పార్క్ ప్రకటించడంపై కూడా సినీ వన్ స్టూడియోస్ అభ్యంతరం తెలిపింది. ఈ ప్రాజెక్టు విషయంలో తమతో సంప్రదింపులు జరపాల్సి ఉందని స్పష్టం చేసింది.
అయితే ఈ సినిమా హక్కుల్ని సినీ వన్ స్టూడియోస్ సంస్థ 2.2 కోట్లకు వదులుకుందని చెబుతూ అందుకు సంబంధించిన ఒప్పంద పత్రాల్ని టి సిరీస్ తరపు న్యాయవాది అమిత్ సిబల్ కోర్టుకు సమర్పించారు. సినీ వన్ స్టూడియోస్ ఈ విషయాన్ని దాచిపెట్టిందని వాదించారు. ఈ ఒప్పందంపై వివరణ ఇవ్వాలని కోర్టు సినీ వన్ స్టూడియోస్ సంస్థను ఆదేశిస్తూ కేసు విచారణ జనవరి 18కు వాయిదా వేసింది. ఈ క్రమంలో యనిమల్ సినిమా నిర్ణీత తేదీ జనవరి 26కు స్ట్రీమింగ్ అవుతుందా లేదా అనేది సందేహంగా మారింది.
Also read: Supreme Court: ఇవాళ తేలనున్న చంద్రబాబు భవితవ్యం, క్వాష్‌పై సుప్రీంకోర్టు తీర్పు నేడే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook