Supreme Court: ఇవాళ తేలనున్న చంద్రబాబు భవితవ్యం, క్వాష్‌పై సుప్రీంకోర్టు తీర్పు నేడే

Supreme Court: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో నిందితుడైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భవితవ్యం ఇవాళ తేలనుంది. ఈ కేసులో దాఖలైన క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలుడనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 16, 2024, 07:41 AM IST
Supreme Court: ఇవాళ తేలనున్న చంద్రబాబు భవితవ్యం, క్వాష్‌పై సుప్రీంకోర్టు తీర్పు నేడే

Supreme Court: ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో ఇవాళ అత్యంత కీలకమైన పరిణామం చోటుచేసుకోనుంది. ఈ కేసులో సెక్షన్ 17ఎ వర్తిస్తుందా లేదా అనేది తేలనుంది. చంద్రబాబు అరెస్ట్ సక్రమమా లేదా అక్రమమా అనేది కోర్టు తేల్చనుంది. ఇప్పటికే విచారణ ముగిసిన ఈ కేసులో తీర్పు గత కొద్దినెలలుగా రిజర్వ్ లో ఉంది. 

ఏపీ స్కిల్ కుంభకోణం కేసులో అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ కింద గవర్నర్ ముందస్తు అనుమతి తీసుకోకుండా అరెస్టు చేశారనేది చంద్రబాబు తరపు న్యాయవాదుల ప్రధాన అభ్యంతరం. అందుకే ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటీషన్ తొలుత ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. ఏసీబీ కోర్టు ఆ పిటీషన్ కొట్టివేయడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టులో ఈ కేసుపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. సెప్టెంబర్ 22వ తేదీన హైకోర్టు సైతం క్వాష్ పిటీషన్ కొట్టివేసింది. దాంతో మరుసటి రోజున సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేశారు చంద్రబాబు తరపు న్యాయవాదులు. సెప్టెంబర్ 25న ఎస్ఎల్‌పి త్వరగా స్వీకరించాలని కోరుతూ సీజేఐని కోరారు. సెప్టెంబర్ 27వ తేదీన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టిల ధర్మాసనంలో జస్టిస్ భట్టి నాట్ బిఫోర్ మి అంటూ తప్పుకున్నారు. దాంతో ఈ కేసును జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం సుదీర్ఘంగా విచారించింది. చాలా పర్యాయాలు రోజంతా వాదనలు జరిగాయి. అన్ని కోణాల్లో కేసుపై వాదనలు విన్న తరువాత విచారణ ముగించిన సుప్రీంకోర్టు అక్టోబర్ 17వ తేదీన తీర్పు వాయిదా పడింది. ఆ తరువాత, దసరా, దీపావళి,వింటర్ హాలిడేస్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇవాళ జనవరి 16న ఈ కేసులో తీర్పు వెలువడనుంది. 

ఈ కేసులో రాష్ట్రంలోని యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ నిమిత్తం 3300 కోట్లకు సీమెన్స్ సంస్థ, డిజైన్ టెక్ సంస్థ ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో 10 శాతం ప్రభుత్వ నిధఘులు, 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లించేలా ఒప్పందం. జీస్టీ చెల్లింపు విషయంలో జరిగిన అవకతవకల కారణంగా అప్పటి ప్రభుత్వ హయాంలోనే పూణే జీఎస్టీ కార్యాలయం నుంచి ఈ స్కాంపై తొలిసారిగా అభ్యంతరం వ్యక్తమైంది. ఆ తరువాత ప్రభుత్వం మారిన తరువాత ఏపీ సీఐడీ అభియోగం నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఆసక్తిగా మారింది. 

Also read: AP Volunteers: వాలంటీర్లకు సంక్రాంతి కానుక, 15 నుంచి 25 వేలు ఇచ్చేందుకు నిర్ణయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News