Aranya Trailer: భారీ అంచనాలు పెంచిన అరణ్య ట్రైలర్

Aranya Trailer review in Telugu: రానా దగ్గుబాటి, విష్ణు విశాల్, జోయ హుస్సేన్, శ్రియ పిల్గావోంకర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అరణ్య మూవీ ట్రైలర్ ఆడియెన్స్ ముందుకొచ్చేసింది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్టు తాజాగా రిలీజైన ట్రైలర్ ద్వారా అంతే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడేలా చేసింది.

Last Updated : Mar 4, 2021, 06:35 AM IST
Aranya Trailer: భారీ అంచనాలు పెంచిన అరణ్య ట్రైలర్

Aranya Trailer review in Telugu: రానా దగ్గుబాటి, విష్ణు విశాల్, జోయ హుస్సేన్, శ్రియ పిల్గావోంకర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అరణ్య మూవీ ట్రైలర్ ఆడియెన్స్ ముందుకొచ్చేసింది. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్టు తాజాగా రిలీజైన ట్రైలర్ ద్వారా అంతే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడేలా చేసింది. అభివృద్ధి పేరిట అడవిని ఆక్రమిస్తున్న మనుషులకు, ఆ అటవీ సంపదతో పాటు అక్కడి వణ్య మృగాలు, ముఖ్యంగా ఏనుగులను కాపాడటం కోసం ఒకరిద్దరు చేసే పోరాటమే ఈ అరణ్య మూవీ అని Aranya trailer చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది.  

Elephants కోసం అడవి మనిషిగా Rana Daggubati చేస్తున్న ఒంటరి పోరాటంలో అతడికి అండగా నిలిచింది ఎవరు ? అతడి ఆశయానికి తూట్లు పొడుస్తూ ఆ అడివిని ఆక్రమించాలని చూసిన వారి లక్ష్యం నెరవేరిందా ? అడవి కోసం, అడవిలో ఏనుగుల కోసం అతడు సాగించిన పోరాటంలో విజయం సాధించాడా లేదా ? సాధిస్తే ఆ విజయం ఎలా సాధ్యమైంది అనేది తెలియాలంటే మార్చి 26న Aranya movie release అయ్యే వరకు వేచిచూడాల్సిందే. ప్రముఖ దర్శకుడు Prabu Solomon డైరెక్ట్ చేసిన ఈ Aranya movie ని ఎరోస్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఇదే సినిమా హిందీలో Haathi Mere Saathi, తమిళంలో Kaadan పేరిట విడుదల కానుంది.

Also read : Lamborghini Urus car: రూ. 5 కోట్లతో ఎవ్వరికీ లేని Luxury car book చేసిన Jr Ntr !

ఇదిలావుంటే, Rana Daggubati, Sai Pallavi, నందితా దాస్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన విరాట పర్వం మూవీ సైతం ఏప్రిల్ 30న విడుదల కానున్న సంగతి తెలిసిందే. వేణు ఉడుగుల డైరెక్ట్ చేస్తున్న Viraata Parvam movie ని సురేష్ బాబు, చెరుకూరి సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x