I Hate You: వైవిధ్యమైన కథతో రానున్న ‘ఐ హేట్ యు’.. త్వరలోనే విడుదలకు సిద్ధం

Karthik Raju: కార్తీక్ రాజు హీరోగా రానున్న ఐ హేట్ యు సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో చిన్న మీడియా మీట్ నిర్వహించారు ఈ సినిమా యూనిట్.. ఈ మీట్ లో సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు…

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2024, 02:55 PM IST
I Hate You: వైవిధ్యమైన కథతో రానున్న ‘ఐ హేట్ యు’.. త్వరలోనే విడుదలకు సిద్ధం

Karthik Raju I Hate You: వైవిద్యమైన కథలతో వస్తే.. మన తెలుగు ప్రేక్షకులు ఆ చిత్రాన్ని ఆదరించడంలో ఎప్పుడూ ముందరు ఉంటారు.
ఇప్పుడు అలాంటి కథతోనే ‘అథర్వ’ ఫేమ్ కార్తీక్ రాజు  హీరోగా రానున్న ప్రేమ కథ చిత్రం ఐ హేట్ యు. కార్తీక్ రాజ్..మోక్ష, షెర్రీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న ఈ సినిమాను బి.లోకనాథం సమర్పణలో శ్రీ గాయత్రి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగరాజ్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు అంజి రామ్ దర్శకత్వం వహించారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో మీడియా మీట్  కి హాజరయ్యారు ఈ సినిమా యూనిట్..

ఈ సందర్భంగా ఈ సినిమా ప్రొడ్యూసర్ నాగరాజ్ మాట్లాడుతూ ‘‘మా ‘ఐ హేట్ యు’ చిత్రం లవ్ సైకలాజికల్ చిత్రంగా ప్రేక్షకులను మెప్పించటానికి త్వరలోనే థియేటర్స్లోకి రానుంది. డిఫరెంట్ సబ్జెక్ట్‌తో డైరెక్టర్ అంజిరామ్‌గారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. కార్తీక్ రాజు, మోక్ష, షెర్రీ అగర్వాల్ సహా అందరూ నటీనటుల, టెక్నీషియన్స్ చక్కటి సహకారాన్ని అందించటంతో అనుకున్న ప్లానింగ్ ప్రకారం మూవీని పూర్తి చేశాం. అందరికీ థాంక్స్. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేమలో కొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం” అని తెలియజేశారు.

ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు.

ఈ సినిమాకి అసోసియేట్ ప్రొడ్యూసర్ గా అనూష..కో ప్రొడ్యూసర్ గా విష్ణు తేజ స‌ర్విశెట్టి వ్యవహరిస్తుండగా సినిమాటోగ్రఫీ బాధ్యతలు ఎస్.మురళీ మోహన్ రెడ్డి.. మ్యూజిక్.హ సాకార్ అందిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఒరిజినల్ స్టోరి, డైలాగ్స్.. ప్రభోద్ ఇస్స్తుండగా ఎడిటర్ గా జె.ప్రతాప్ కుమార్.. కొరియోగ్రాఫర్ గా అనీష్ వ్యవహరిస్తున్నారు.

Also Read: Captain Miller Trailer: పవర్ ప్యాక్డ్‌గా ధనుష్ ‘'కెప్టెన్‌ మిల్లర్'’ ట్రైల‌ర్

Also Read: Guntur Kaaram Trailer: మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఇవాళే 'గుంటూరు కారం' ట్రైలర్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News