Actor Sathyaraj mother passed away: బాహుబలి సినిమాలోని కట్టప్ప పాత్రతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన నటుడు సత్యరాజ్(Actor Sathyaraj). కోలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు ఈ ఒక్క సినిమాతోనే వచ్చింది సత్యరాజ్ కు. తమిళ్ లో ఈయనను రెబల్ స్టార్ గా ప్రేక్షకులు మద్దుగా పిలుచుకుంటారు. అయితే తాజాగా నటుడు సత్యరాజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి నతంబాల్ (94)(Nathambal Kalingarayar) వృద్దాప్య సమస్యలతో కన్నుమూశారు. కోయంబత్తూర్ లోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
ఆయన తల్లి మరణ వార్త విన్న వెంటనే హైదరాబాదులో షూటింగ్ లో ఉన్న సత్యరాజ్ వెంటనే కోయంబత్తూర్ కి చేరుకున్నారు. నతంబాల్ కి ముగ్గురు పిల్లలు.. అందులో అబ్బాయి సత్య రాజ్ కాగా అమ్మాయిలు కల్పన, రూప. సత్య రాజుకు తన తల్లి అంటే ఎంతో ప్రేమ. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. సత్యరాజ్ తల్లి మృతి పై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కోలీవుడ్ నటుడు ఎమ్మెల్యే అయిన ఉదయనిధి స్టాలిన్ కూడా ట్విట్టర్ వేదికగా తన సంతాపం ప్రకటించారు. సత్యరాజ్ కుమారుడు శివ సత్యరాజ్ కోలీవుడ్ లో హీరోగా రాణిస్తున్నాడు.
Also Read: Spirit Movie Update: ప్రభాస్ ‘స్పిరిట్’కు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. ఎవరంటే?
బాహుబలి సినిమాలో కట్టప్పగా తన నటనతో ఆ మూవీని ఓ రేంజ్ కు తీసుకెళ్లారు సత్యరాజ్. ప్రస్తుతం ఆయన తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఎక్కువగా క్యారెక్టర్ రోల్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. అంతేకుండా తన విలక్షణ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వసంత్ రవితో కలిసి నటించిన 'వెపన్(Weapon)' సినిమా త్వరలో ప్రేక్షకుల మందుకు రానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి