ప్రతీ కొడుకు గెలిచే వరకు నాన్న దృష్టిలో బేవర్సే.. బేవర్స్ మూవీ ట్రైలర్ విడుదల

బేవర్స్ మూవీ ట్రైలర్ విడుదల

Last Updated : Sep 30, 2018, 02:36 PM IST
ప్రతీ కొడుకు గెలిచే వరకు నాన్న దృష్టిలో బేవర్సే.. బేవర్స్ మూవీ ట్రైలర్ విడుదల

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో, నూతన నటీనటులు సంజోష్, హర్షిత జంటగా నటించిన బేవర్స్ సినిమా ట్రైలర్ విడుదలైంది. రమేష్ చిప్పల అనే ఓ కొత్త దర్శకుడు రచించి, డైరెక్ట్ చేసిన ఈ సినిమాను పొన్నాల చందు, డా.ఎం.ఎస్. మూర్తి, ఎం అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బేవర్స్ సినిమాలో పాత్రల తీరుతెన్నులపై ఓ అవగాహన వచ్చేలా.. "రాముడు లాంటివాడు పుట్టాలని పూజలు చేస్తే, రామ్ గోపాల్ వర్మ లాంటోడు పుట్టాడు" అనే డైలాగ్‌తో మేకర్స్ ఈ ట్రైలర్‌ని విడుదల చేశారు. అయితే, జీవితంలో ఏదో ఒకటి సాధించే వరకు ప్రతీ కొడుకు తండ్రి దృష్టిలో బేవర్స్‌గానే కనిపిస్తాడు అనే పాయింట్ చుట్టూ ఈ కథనాన్ని రాసుకున్నట్టు ట్రైలర్ చివర్లో వచ్చిన మరో డైలాగ్ చూస్తే అర్థమవుతోంది.

Trending News