Bharatheeyudu 2 First Review: ‘భారతీయుడు 2’ ఫస్ట్ రివ్యూ.. కమల్ హాసన్ హిట్టు కొట్టినట్టేనా.. !

Bharatheeyudu 2 First Review: శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘భారతీయుడు 2’. దాదాపు 28 యేళ్ల క్రితం విడుదలైన ‘భారతీయుడు’ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను రూపొందించారు. మరి ఈ సినిమాతో కమల్ హాసన్ మరో హిట్ అందుకున్నాడా. లేదా మన ఫస్ట్ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Jul 11, 2024, 04:43 PM IST
Bharatheeyudu 2 First Review: ‘భారతీయుడు 2’ ఫస్ట్ రివ్యూ.. కమల్ హాసన్ హిట్టు కొట్టినట్టేనా.. !

Bharatheeyudu 2 Movie Review in Telugu: లోక నాయకుడు గత చిత్రం ‘విక్రమ్’ మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. దాదాపు విశ్వరూపం తర్వాత సరైన సక్సెస్ లేని కమల్ హాసన్ .. విక్రమ్ మూవీతో సాలిడ్ హిట్ అందుకొని .. హీరోగా తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసాడు. దాదాపు ఐదేళ్ల క్రితం శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు 2’ మూవీ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. 1996లో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భారతీయుడు’ సినిమాలో సేనాపతిగా.. చంద్రబోస్ గా రెండు విభిన్న పాత్రల్లో అలరించారు. అంతేకాదు లంచగొండి తనాన్ని సహించని భారతీయుడు ..సేనాపతి.. తన కుమారుడిని చంపేసి విదేశాలకు వెళ్లిపోతాడు. ఆ తర్వాత మళ్లీ దేశంలో అరాచకం, లంచగొండితనం అనేది ప్రభలుతుంది.

దీన్ని అరికట్టడానికి మళ్లీ సేనాపతి విదేశాల నుంచి మన దేశానికి వస్తాడు. ఈ క్రమంలో అవినీతి పరులను ఎలా అంత మొందించాడనేదే ఈ ‘భారతీయుడు 2’ స్టోరీ. ఈ సినిమా దాదాపు ఐదేళ్ల పాటు షూటింగ్ జరిగింది. మధ్యలో ఎన్నో అవాంతరాలు.. కొంత మంది నటీనటులు.. టెక్నిషియన్స్  చనిపోవడంతో పాటు కోవిడ్ వంటివి ఈ సినిమా నిర్మాణంలో అంతరాయం కలిగించాయి. అయితే  శంకర్ వాటన్నింటినీ తట్టుకొని ఈ సినిమాను ఎలాగో అలా పూర్తి చేసాడు. అంతేకాదు కొన్ని సీన్స్ ను రీ షూట్ చేయాల్సి వచ్చింది కూడా.
ఇక సెన్సార్ సభ్యులు కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు మీడియాకు వేసిన ప్రత్యేక షోలో  ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్ధ్, నెడుముడి వేణు, ఎస్. జె.సూర్య ముఖ్యపాత్రల్లో నటించారు. ఒక ‘భారతీయుడు’ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. కానీ భారతీయుడు 2కు అనిరుథ్ రవిచంద్రన్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇందులో పలు సన్నివేశాల్లో అనిరుథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. ఇందులోని పాటలు కూడా ప్రేక్షకులకు చేరువ అయ్యాయి.

దశావతారం సినిమాలో కమల్ హాసన్ పది గెటప్స్ లో కనిపిస్తే.. భారతీయుడు 2లో మాత్రం 12 గెటప్స్ లో కనిపించనున్నారు. ఈ సినిమాను తమిళంలో ఇండియన్ 2 పేరుతో విడుదలైతే.. హిందీలో హిందూస్తానీ పేరుతో విడుదల చేస్తున్నారు. మొత్తంగా తమిళం, తెలుగు, హిందీ భాషల్లోనే ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. పైగా తెలుగు రాష్ట్రాల్లో  ఈ సినిమా టికెట్ రేట్స్ ఎనిమిది రోజులు పెంచుకోవడానికి స్పెషల్ పర్మిషన్స్ ఇచ్చారు. ఇప్పటికే పెరిగిన టికెట్ రేట్స్ కారణంగా సినిమాలకు దూరమైన మధ్యతరగతి వారు.. ఈ సినిమాను ఏ మేరకు థియేటర్స్ లో ఏ మేరకు  ఆదరిస్తారనేది చూడాలి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News