Bhimlanaik producer: మనిషికి పొగరు , అహంకారం మంచిది కాదు. పబ్లిక్ లైఫ్‌లో ఉన్నప్పుడు మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే భీమ్లానాయక్ నిర్మాతకు ఎదురైన పరిస్థితి ఉంటుంది. క్షమాపణలు చెప్పుకోవల్సి వస్తుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన భీమ్లానాయక్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నోటిదురుసుతో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. టీజే టిల్లు సక్సెస్ మీట్‌లో మీడియా సాక్షిగా నోటిదురుసు ప్రదర్శించాడు. ప్రేక్షకుల్ని ఏకవచనంతో బోధించాడు. వాడు వీడు అంటూ మట్లాడాడు. తనకు తాను మేధావుల్లా అభివర్ణించుకున్నాడు. ప్రేక్షకుడిని 100 రూపాయలతో పోలుస్తూ...వాడికేం కావాలో..తమకు తెలుసని వ్యాఖ్యానించాడు. వాడు ఖర్చు పెట్టే డబ్బుకు పదింతలు వినోదాన్ని ఇస్తున్నామంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడాడు. దీంతో నాగవంశీ వ్యాఖ్యలైప నెటిజన్లు మండిపడ్డారు.
సోషల్ మీడియా సాక్షిగా భారీగా ట్రోల్ చేశారు. కామెంట్ల రూపంలో దుమ్మెత్తిపోశారు. ఓ దశలో సినిమాను బాయ్‌కాట్ చేయాలనే పిలుపు కూడా ఇచ్చారు కొంతమంది. నాగవంశీ మాటల పట్ల ప్రేక్షకులు చాలా మనస్థాపానికి లోనయ్యారు. సోషల్ మీడియాలో హల్‌చల్ అయ్యేసరికి చేసిన తప్పేంటో తెలిసొచ్చినట్టుంది నాగవంశీకు. ట్వీట్టర్ వేదికగా క్షమాపణలు కోరాడు. ప్రేక్షకులంటే ఎంతో గౌరవమని...ఏ నిర్మాణ సంస్థకైనా ప్రేక్షకులే బలమని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేశాడు. ప్రేక్షకులు పెట్టే డబ్బుకు మించిన వినోదం అందించామనే ఆనందంతో చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులకు ఇబ్బంది కల్గించాయని తెలిసి బాధపడినట్టు చెప్పుకొచ్చాడు. సోదరభావంతోనే ఏకవచనంతో మాట్లాడానన్నాడు. అయినా...ప్రేక్షకుల మనసు నొప్పించినందుకు క్షమించాలని కోరుకున్నాడు.
చెంపపై లాగి పెట్టి కొట్టి సారీ చెబితే సరిపోతుందా అంటున్నారిప్పుడు నెటిజన్లు. ఒకసారి మనసు గాయపడిన తరువాత తిరిగి రికవరీ అంటే కష్టమేనంటున్నారు. ఏదేమైనా సరే నోటిదురుసు ఫలితం భీమ్లానాయక్ నిర్మాతకే బాగా తెలుసు ఇప్పుడు.
Also read: Bachchhan Paandey Trailer: బచ్చన్ పాండే ట్రైలర్ చూశారా?.. కామెడి ప్లస్ అరాచకం కలగలిపిన వీడియో!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook