NTR: రూమర్స్ కి చెక్…జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాపై బిగ్ అప్డేట్..

War 2: ఆర్ఆర్ఆర్ సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీస్ పై వరల్డ్ వైడ్ ఆసక్తి నెలకొని ఉంది. టాలీవుడ్ లోనే కాక ఇప్పుడు బాలీవుడ్ లో కూడా వార్ సినిమా తో ఈ హీరో ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 మూవీ నుంచి ఓ లేటెస్ట్ అప్డేట్ వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 27, 2024, 03:01 PM IST
NTR: రూమర్స్ కి చెక్…జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాపై బిగ్ అప్డేట్..

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత దేవర చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ మూవీ తర్వాత తారక్ బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 షూటింగ్ లో పాల్గొంటారు అన్న టాక్ వినిపిస్తోంది. కానీ మరోపక్క ఇది ఇప్పట్లో జరిగే అవకాశం లేదు అన్న మాట కూడా బలంగా వినిపిస్తోంది. ఈ సందేహాలకు పుల్ స్టాప్ పెడుతూ తాజాగా వార్ 2 మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ ఎప్పటి నుంచి పాల్గొంటారు అన్న విషయంపై క్లారిటీ వచ్చింది.

ఏప్రిల్ తర్వాత తారక్ వార్ 2 మూవీ సెట్స్ కి హాజరవుతారట. ఈ నేపథ్యంలో నెలరోజుల పాటు 
తారక్ పై కొన్ని ముఖ్య సన్నివేశాల షూటింగ్ జరుగుతుంది. మే పూర్తయ్యేసరికి వార్ 2 మూవీకి సంబంధించి తారక్ పై ఉన్న అన్ని కీలకమైన సన్నివేశాల షూటింగ్ పూర్తి అయ్యే విధంగా చిత్ర బృందం ప్లానింగ్ చేస్తున్నారు. ఇక ఈ షూటింగ్ ముంబై లొకేషన్స్ తో పాటు థాయిలాండ్ లో కూడా జరుగుతుంది. ఈ నెల రోజుల షెడ్యూల్ పూర్తి అయిన తర్వాత తారక్ తిరిగి దేవర షూటింగ్ లో పాల్గొంటారు.

అక్టోబర్ 10 న దేవర రిలీజ్ కాబోతున్నట్లు ఇప్పటికే జోరుగా ప్రచారం సాగుతోంది. ఆగస్టు లోపు ఈ చిత్రానికి సంబంధించిన మొత్తం చిత్రీకరణ పూర్తి చేసుకొని ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయడానికి మూవీ యూనిట్ ప్లాన్ చూస్తోంది. అనుకున్నట్టు ఆగస్టు కు దేవర చిత్రం షూటింగ్ పూర్తి అయితే.. ఆ తర్వాత వెంటనే ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ కు వెళ్లాల్సి ఉంటుంది. మరోపక్క కొరటాల దేవర పార్ట్ 2 షూటింగ్ కు పెద్ద గ్యాప్ తీసుకునేలా కనిపించడం లేదు.

దేవర పార్ట్ 1 విడుదల అయిన వెంటనే రెండు మూడు నెలల లోపే సీక్వెల్ మొదలు పెట్టే అవకాశం ఉంది. ఇక వార్ 2 మూవీలో ఎన్టీఆర్ పాత్ర పై పలు రకాల గాసిప్స్ నడుస్తున్నాయి. కొందరు ఇందులోనే ఎన్టీఆర్ నెగటివ్ రోల్ ప్లే చేస్తున్నారు అంటే.. మరికొందరు ఓ కమాండో గా కనిపించబోతున్నారు అని అంటున్నారు. ఇప్పటివరకు ఈ మూవీలో తారక్ పాత్రకు సంబంధించి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లీక్ కాలేదు. ఈ నేపథ్యంలో ఈ విషయం పెద్ద సస్పెన్స్ గా మారుతోంది.

Also read: AP Elections 2024: ఏపీలో బీజేపీ అభ్యర్ధులు ఎవరు ఎక్కడ్నించి పోటీ

Also read: Lenovo M11 Tab: 7వేల ఎంఏహెచ్ బ్యాటరీ, 8జీబి ర్యామ్‌తో చాలా తక్కువ ధరకే లెనోవో ట్యాబ్

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News