Bigg Boss 6 Nominations : బిగ్ బాస్ ఐదో వారం నామినేషన్ లిస్ట్.. విడిపోనున్న జంట?

Bigg Boss 6 Telugu 5th Week Nomination బిగ్ బాస్ ఇంట్లో ఐదో వారం నామినేషన్ ప్రక్రియతో అందరినీ ఇరికించేశాడు. ఇద్దరిద్దరినీ జంటలుగా చేసిన బిగ్ బాస్.. అందులోంచి ఎవరో ఒకరిని నామినేట్ అవ్వమని, ఇంకొకరిని సేవ్ అవ్వమని చెప్పుకొచ్చేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 3, 2022, 05:52 PM IST
  • బిగ్ బాస్ ఇంట్లో ఐదో వారం నామినేషన్స్
  • జంటగా వచ్చిన మెరినా రోహిత్‌కు షాక్
  • అర్జున్ ప్రేమకు సత్య ప్రతిఫలం ఇదే?
Bigg Boss 6 Nominations : బిగ్ బాస్ ఐదో వారం నామినేషన్ లిస్ట్.. విడిపోనున్న జంట?

Bigg Boss 6 Telugu 5th Week Nomination : బిగ్ బాస్ ఇంట్లో ఐదో వారం నామినేషన్ ప్రక్రియ హీటెక్కేలా ఉంది. ఇప్పటికే బిగ్ బాస్ ఇంట్లో నాలుగు వారాలు గడిచాయి. నలుగురు కంటెస్టెంట్లు బయటకు వచ్చేశారు. షానీ, అభినయ, నేహా, ఆరోహి ఎలిమినేట్ అయ్యారు. నిన్న జరిగిన ఎపిసోడ్లో ఆరోహి ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది. ఇప్పుడు ఆరోహి తరువాత బయటకు వెళ్లే కంటెస్టెంట్ కోసం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. సోమవారం నాటి ఎపిసోడ్‌లో ఈ నామినేషన్ ప్రక్రియ ప్రసారం కానుంది. ఈ సారి ఇంటి సభ్యుల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు బిగ్ బాస్.

ప్రతీ సీజన్లో ఉన్న మాదిరిగానే.. ఈ సీజన్లోనూ నామినేషన్ ప్రాసెస్ ఉంది. ఇద్దరిద్దరినీ ఓ జట్టుగా చేస్తారు.. అందులో ఎవరు నామినేట్ అవ్వాలి.. ఎవరు సేవ్ అవ్వాలని వాగ్వాదించుకోవాలి. చివరకు ఎవరో ఒకరు తగ్గాలి.. ఒకరు నెగ్గాలి.. ఒక వేళ ఎంత వరకూ వ్యవహారం తెగకపోతే.. ఇద్దరూ నామినేట్ అవుతుంటారు. ఇలా ఓ సారి జరిగింది కూడా. అయితే ఇప్పుడు ఈ ఆరో సీజన్ కోసం ఐదో వారంలో ఇలాంటి ఓ నామినేషన్ ప్రక్రియనే బిగ్ బాస్ తన కంటెస్టెంట్ల ముందుంచాడు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter Facebook

Trending News