Bigg Boss Fifth Week Elimination : ఎలిమినేట్ అయ్యేది ఎవరు?.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు?

Bigg Boss 6 Telugu Fifth Week Elimination బిగ్ బాస్ ఇంట్లో ఐదో వారంలో నామినేషన్ ప్రక్రియ జంటలుగా జరిగింది. ఇక ఎలిమినేషన్ ప్రక్రియ కూడా అందరిలోనూ ఆసక్తి రేకెత్తించేలా ఉంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 8, 2022, 03:14 PM IST
  • బిగ్ బాస్ ఇంట్లో ఐదో వారం
  • డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు
  • ఎలిమినేషన్‌లో చంటి లేదా మెరినా?
Bigg Boss Fifth Week Elimination :  ఎలిమినేట్ అయ్యేది ఎవరు?.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు?

Bigg Boss 6 Telugu Fifth Week Elimination :  బిగ్ బాస్ ఇంట్లోంచి ప్రతీ వారం ఓ సభ్యుడు బయటకు వెళ్లాల్సిందే. అయితే ఈ ఆరో సీజన్ మొదటి వారంలో కాస్త కొత్తగా ట్రై చేశారు. మొదటి వారం నో ఎలిమినేషన్ అని చెప్పారు. అయితే రెండో వారం ఇద్దరిని ఎలిమినేట్ చేసి షాక్ ఇచ్చారు. అలా రెండో వారంలో షానీ, అభినయ ఎలిమినేట్ అయ్యారు. మూడో వారంలో నేహా ఎలిమినేట్ అయింది. నాలుగో వారంలో ఆరోహి ఎలిమినేట్ అయింది. ఇక ఇప్పుడు ఐదో వారం ఎలిమినేషన్ టైం వచ్చేసింది.

ఇప్పటికే లీకులు హల్చల్ చేస్తున్నాయి. ఐదో వారంలో ఫైమా, వాసంతి, అర్జున్, ఇనయ, చంటి, మెరినా, ఆదిరెడ్డి, బాలాదిత్య నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో బాలాదిత్య, మెరినా, ఆదిరెడ్డి, చంటి ఇలా అందరికీ ఒకే రేంజ్లో ఓట్లు పడ్డట్టు తెలుస్తోంది. మామూలుగా అయితే బాలాదిత్య, మెరినా, చంటి డేంజర్ జోన్లో ఉన్నట్టు తెలుస్తోంది.

వాసంతికి మంచి క్రేజ్ ఉండటంతో.. భారీగానే ఓట్లు పడ్డట్టు తెలుస్తోంది. మరి ఈ వారం వాసంతి ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నట్టుంది. చంటి లేదా మెరినాలోంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యేందుకు ఎక్కువగా అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు వినిపిస్తున్న లీకుల ప్రకారం చంటి ఎలిమినేట్ అయినట్టు టాక్ వినిపిస్తోంది.

అయితే ఎవరు ఎలిమినేట్ అయ్యారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కొందరు చంటి అని అంటుంటే.. ఇంకొందరు మెరినా అని అంటున్నారు. అయితే ఈ ఇద్దరే ప్రస్తుతం డేంజర్ జోన్లో ఉన్నట్టు తెలుస్తోంది. మెరినా ఒకవేళ ఎలిమినేట్ అయితే మాత్రం రోహిత్ ఎలా ఆడతాడు? అసలు ఇంట్లో ఉండగలడా? అన్నది చూడాలి.

Also Read: Sarvadaman Banerjee Re Entry: 35 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన హీరో.. గాడ్ ఫాదర్లో చిరంజీవి నాన్న గారు ఎవరో తెలుసా..?

Also Read: Sreeleela Mother: కుమార్తెకు తలనొప్పిగా మారిన శ్రీలీల తల్లి.. వరుస కేసులతో !

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News