Bigg Boss Geetu : అడిగి మరీ పరువుతీసుకోవడం అంటే ఇదే.. గీతూ అతి ఇక మారదా?

Bigg Boss 6 Telugu Galata Geetu బిగ్ బాస్ ఇంట్లో గలాట గీతూ పెడుతున్న నస, చేస్తోన్న ఓవర్ యాక్షన్ గురించి అందరికీ తెలిసిందే. గీతూకి విపరీతమైన నెగెటివిటీ పెరిగింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 23, 2022, 07:59 AM IST
  • బిగ్ బాస్ ఇంట్లో ఏడో వారం
  • అందరికీ కౌంటర్లు వేసిన నాగార్జున
  • అడిగి పరువుతీయించుకున్న గీతూ
Bigg Boss Geetu : అడిగి మరీ పరువుతీసుకోవడం అంటే ఇదే.. గీతూ అతి ఇక మారదా?

Bigg Boss Geetu : బిగ్ బాస్ ఇంట్లో భరించలేని కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారని ఓటింగ్ పెడితే.. కచ్చితంగా అందులో గీతూ పేరు టాప్‌లో వస్తుంది. ఆమె చేసే చేష్టలు, మాట్లాడే మాటలు, అతి అన్నీ కూడా జనాలకు తలపోటుగా మారిపోయాయి. ఆమె చేస్తే రైట్.. మిగతా వాళ్లు చేస్తే తప్పు అన్నట్టుగా ఉంటుంది. ఆమె చేసేది మాత్రమే రైట్ అనే భ్రమలో ఉంటుంది. ఎదుటివారు మాట్లాడేది వినదు. వినిపించుకోదు. అర్థం చేసుకునేందుకు కూడా ట్రై చేయదు. ఎదుటి వారి గురించి చెప్పమంటే చాంతాడంతా చెబుతుంది. కానీ తన పరిస్థితి, తన ప్రవర్తన ఏంటన్నది చూసుకోలేకపోతోంది.

మధ్యలోకి ఎందుకు దూరతావ్ అని ఎదుటి వాళ్లను అంటుంది.. కానీ ఈమె మాత్రం అన్నింట్లోకి దూరుతుంది. ఎందుకు అని అడిగితే.. ఇంట్లో ఉంటున్నా.. నేనూ ఓ కంటెస్టెంట్.. నాకు హక్కుందని దబాయిస్తుంటుంది. అలా గీతూ ఓ పిచ్చి పట్టిన దానిలా ప్రవర్తిస్తుంటుందని జనాలు అనుకుంటూ ఉంటారు. ఆ మధ్య ఓ సారి గీతూ సేవ్ అయ్యాక చెప్పిన మాటలకు జనాలు బెంబేలెత్తిపోయారు. నాలాంటి అమ్మాయి మీ ఇంట్లో ఉండాలనుకునేలా చేస్తాను అని గీతూ చెప్పింది. దీంతో ఆడియెన్స్ మాత్రం.. వద్దు బాబోయ్ అనేశారు. అది చూసి నాగార్జున కూడా నవ్వేశాడు.

అంతలా గీతూ జనాల చేత.. గీ.. తూ.. అనిపించుకుంది. తన తండ్రి చెప్పినా కూడా మారదు. వినేందుకు కూడా ప్రయత్నించలేదు. ఎంత సేపు తన ధోరణి తానే అన్నట్టుగా ఉంటుంది. నాగార్జున ముందు కాస్త అతి వినయం ప్రదర్శిస్తుంటుంది. అక్కడా ఆమె అతి కూడా కనిపిస్తుంది. ఇక నిన్నటి వీకెండ్ ఎపిసోడ్‌లోనూ గీతూ అందరి ముందు తెల్లమొహం వేసుకోవాల్సి వచ్చింది. ఫైమాను బెస్ట్ సంచాలక్‌ అని చెబుతుంటే.. మధ్యలోకి దూరింది గీతూ. నేను ఎలా చేశాను అని అడుక్కుంది.

దీంతో నాగార్జున ఓ వీడియో చూపించి పరువుతీశాడు. కబడ్డీ ఆటలో ఆమె నిర్ణయం తప్పని చెప్పాడు. ఆదిరెడ్డిని వాసంతి తాకనేలేదు. కానీ నువ్ తాకిందని చెప్పావ్. ఇలా ఉంది నీ సంచాలక్ నిర్ణయం అని పరువుతీశాడు. వాసంతి లైన్ కూడా దాటింది.. నువ్ అది కూడా చూసుకోలేకపోయావ్ అని కౌంటర్లు వేశాడు. సంచాలక్‌ వేస్ట్ అన్నట్టుగా మాట్లాడేశాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకన్స్ కదా? అని దాన్ని కూడా సమర్థించుకుంది గీతూ. ఆ తరువాత మరో సారి.. అందరూ బాగా ఆడారు అని నాగార్జున చెబుతాడు. మరి నా ఆట అని గీతూ అడుగుతుంది. ఫిజికల్ టాస్కులు ఇవ్వమని అడిగావ్.. నువ్ ఈ వారం ఆడావ్.. గుద్దిపడేస్తా అని అన్నావ్.. ఏం చేశావ్ అని పరువుతీసేశాడు నాగార్జున.

Also Read : Bigg Boss 7th Week Elimination : బిగ్ బాస్ షాకింగ్ నిర్ణయం.. లవ్ ట్రాక్‌కు పుల్ స్టాప్.. అతడే అవుట్?

Also Read : Prabhas బర్త్ డే.. ఆదిపురుష్‌ అప్డేట్ చూసి ఏడుస్తున్న అభిమానులు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News