Bigg Boss Geetu : నిన్న బిగ్ బాస్ ఇంట్లో గీతూ ఇదే చేసేదంట.. వామ్మో మామూలు సెంటిమెంట్ కాదు

Galata Geetu about Bigg Boss 11th week task బిగ్ బాస్ గీతూ తాజాగా ఓ పోస్ట్ వేసింది. అందులో నిన్న బిగ్ బాస్ టాస్క్ గురించి చెప్పింది. తాను ఇంట్లో ఉంటే ఏం చేసేదో చెప్పింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 16, 2022, 04:52 PM IST
  • బయటకు వచ్చినా గీతూ హవానే
  • నంబర్ గేమ్‌, నిన్నటి ఎపిసోడ్‌పై గీతూ
  • సెంటిమెంట్ కంటిన్యూ చేయడంపై గీతూ గందరగోళం
Bigg Boss Geetu : నిన్న బిగ్ బాస్ ఇంట్లో గీతూ ఇదే చేసేదంట.. వామ్మో మామూలు సెంటిమెంట్ కాదు

Galata Geetu Sentiment number : బిగ్ బాస్ ఇంట్లో మంగళవారం నాడు కంటెస్టెంట్లకు షాక్ తగిలినట్టు అయింది. బిగ్ బాస్ తన విన్నర్‌కు ఇచ్చే ప్రైజ్ మనీలో కోతలు పెట్టేందుకు కొత్త కొత్త టాస్కులు పెడుతున్నాడు. ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్లలోంచి ఒకరికి సేవ్ అయ్యే చాన్స్ఇచ్చాడు. కానీ దానికి విన్నింగ్ అమౌంట్ నుంచి కోత పడుతుంది. గరిష్టంగా ఐదు లక్షలకు ఈ ఆఫర్‌ను చేజిక్కించుకోవాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు. కనిష్టంగా లక్ష రూపాయలు చెక్ మీద రాయాల్సి ఉంటుందని తెలిపాడు.

దీంతో సత్య, రేవంత్, కీర్తి ఇలా అందరూ కూడా అతి తెలివి ఉపయోగించి.. ఐదు లక్షలకు ఒక రూపాయి తక్కువగా రాశారు. కానీ సత్య ఈ విషయాన్ని శ్రీహాన్‌కు హింట్ ఇచ్చింది. దాంతో డిస్ క్వాలిఫై అయింది. ఇలా ఒక్క రూపాయి ఎవ్వరైనా తక్కువగా రాస్తారని తెలుసు.. అందుకే ఇలా రెండు రూపాయలు తక్కువగా రాస్తున్నా అన్నట్టుగా ఇనయ రాసింది. కానీ మెరినా కూడా అదే అమౌంట్ వేసింది.

ఆదిరెడ్డి, శ్రీహాన్‌లు మినిమం అన్నారు కదా?అని లక్ష రాసేశారు. కానీ ఆదిరెడ్డి మాత్రం ఇలా తనకు ఇమ్యూనిటీ వద్దని, తాను విన్ అవుతానని, ఇదంతా తన అమౌంట్ అని కాస్త ఎక్కువే మాట్లాడాడు. అయితే ఇలా ఏ ఇద్దరి అమౌంట్లు కరెక్ట్‌గా కలిసినా వాటిని లెక్కలోకి తీసుకోనని, తరువాత ఉన్న పెద్ద అమౌంట్‌ రాసిన వాళ్లకే ఈ ఆఫర్ దక్కుతుందని చెప్పుకొచ్చాడు.

ఇంట్లో ఉన్న అందరిలోకెల్లా రాజ్ కాస్త తెలివిగా ఆడాడు. రూ. 4,99,700 అంటూ రాసి.. టాస్క్ విన్ అయ్యాడు. నామినేషన్ నుంచి సేవ్ అయ్యాడు. అయితే ఇదే విషయం మీద గీతూని నెటిజన్లు ప్రశ్నించారట. తాను ఉండి ఉంటే., ఏ అమౌంట్ రాసేది అంటూ జనాలు అడిగారు. తన సెంటిమెంట్ నంబర్ తొమ్మిది కాబట్టి.. అన్నీ తొమ్మిదిలు వచ్చేలా ప్లాన్ చేసుకునేదట. రూ. 4,99,995 అని రాసేదట. ఒక వేళ అదే రాసి ఉంటే. గీతూ లోపల ఉండి ఉంటే.. సేవ్ అయ్యేది. 

తొమ్మిది తన సెంటిమెంట్ నంబర్ అయినా కూడా తొమ్మిదో వారంలో బయటకు రావడం, బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉండటంతో ఇకపై బ్లాక్ డ్రెస్ వేసుకోవద్దని, తొమ్మిదిని తన సెంటిమెంట్ నంబర్‌గా ఉంచుకోవద్దని అనుకుందట. కానీ బయటకు వచ్చాక ఈ ప్రేమను చూసి డైలామాలో పడిపోయాను అని గీతూ అంటోంది.

Also Read : Super star Krishna last rites : ముగిసిన సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు.. ఎన్ని తుపాకులు, ఎన్ని రౌండ్ల కాల్పులంటే?

Also Read : Bigg Boss Shrihan : రోజురోజుకీ దిగజారుతున్న శ్రీహాన్.. అదిరిపోయేలా ఇచ్చి పడేసిన కీర్తి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News