Bigg Boss Shivaji: బిగ్ బాస్ విన్నర్ కంటే... మాస్టర్ మైండ్ శివాజీకే రెమ్యూనరేషన్ ఎక్కువ.. బాబోయే అన్ని లక్షలా?

Bigg Boss Shivaji: హీరో శివాజీ బిగ్ బాస్ చాణక్యూడిగా గుర్తింపు పొందాడు. 105 రోజులపాటు హౌస్ లో ఉన్న శివాజీ పారితోషికం ఎంతో తెలిస్తే అందరూ షాక్ అవుతారు. అతడు ఎన్ని లక్షలు తీసుకున్నాడంటే?  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 18, 2023, 08:32 PM IST
Bigg Boss Shivaji: బిగ్ బాస్ విన్నర్ కంటే... మాస్టర్ మైండ్ శివాజీకే రెమ్యూనరేషన్ ఎక్కువ.. బాబోయే అన్ని లక్షలా?

Bigg Boss 7 Shivaji Remuneration: సినిమాల కంటే బిగ్ బాస్ తోనే ఎక్కువ పేరు సంపాదించాడు హీరో శివాజీకి. 90 సినిమాలకుపైగా చేసిన రాని గుర్తింపు ఒక్క బిగ్ బాస్ షోతోనే అందుకున్నాడు. తన అనుభవాన్ని రంగరించి బిగ్ బాస్ లో శివాజీ ఆడిన మైండ్ గేమ్స్ కు ఫిదా అవ్వని అభిమాని ఉండదు. నాగార్జున సైతం శివాజీ ఆటతీరును మెచ్చుకున్నాడు. హౌస్ లో చేయి ఇబ్బంది పెట్టినా బాధను లోపలే దాచుకుంటూ ఇరవైళ్లు కుర్రాడిలా తగ్గేదేలా అన్నట్లు టాస్కులు ఆడాడు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 07 విన్నర్ శివాజీనే అని చాలా మంది భావించారు. 

సోషల్ మీడియాలో శివాజీ ఫాలోయింగ్ చూస్తే మతిపోతుంది. ఓటింగ్ లో ఎప్పుడూ శివాజీనే టాప్ లో ఉండేవాడు. అయితే చివరి వారంలో అంతా ఉల్టాపుల్టా కావడంతో అతడు మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇవాళ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచాడంటే అందుకు ఒక విధంగా  శివాజీనే కారణం. ఈ హీరో అండతోనే కామన్ మ్యాన్ చెలరేగి ఆడి కప్ కైవసం చేసుకున్నాడు. విజేతగా నిలిచిన అనంతరం బిగ్ బాస్ బజ్ లో శివాజీ గురించి ప్రశాంత్ చెప్పిన మాటలు వింటే కన్నీళ్లు రాక మానదు. 

ఆదివారం జరిగిన బిగ్‌ బాస్‌ గ్రాండ్‌ ఫినాలేకు శివాజీ ఇద్దరు కుమారులు వచ్చారు. అయితే శివాజీ ఎలిమినేట్‌ అయిన తర్వాత స్టేజ్ పైకి వచ్చిన అతడి ఇద్దరు కుమారులు కన్నీరు పెట్టుకున్నారు. ముఖ్యంగా చిన్న కొడుకు అయితే బోరున విలపించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. హౌస్ లో మెుత్తం 105 రోజులు ఉన్న శివాజీకి బిగ్ బాస్ విన్నర్ కన్నా ఎక్కువే ముట్టిందని చెప్పాలి. అతడు రోజుకు రూ. 60వేలు ఛార్జ్ చేశాడట. ఈ లెక్కన వారానికి రూ.4.25 లక్షల అన్నమాట. టోటల్ అన్ని రోజులకు గానీ శివాజీ రూ.64 లక్షలు అందుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. 

Also read: Operation Valentine Teaser: గూస్ బంప్స్ తెప్పిస్తున్న వరుణ్ 'ఆపరేషన్‌ వాలెంటైన్‌' టీజర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News