Swetaa Varma : సోషల్ మీడియాకు దూరంగా శ్వేతా వర్మ.. బిగ్ బాస్ బ్యూటీకి ఏమైందంటే?

Swetaa Varma Detox From Social Media శ్వేతా వర్మ బిగ్ బాస్ షోతో బాగానే క్రేజ్ దక్కించుకుంది. బిగ్ బాస్ ఇంట్లో ఆనీ మాస్టర్‌తో ఎక్కువగా క్లోజ్ అయిన కంటెస్టెంట్‌గా శ్వేతా వర్మ నిలిచింది. శ్వేతా వర్మ బిగ్ బాస్ ఇంట్లో ఎక్కువ కాలం ఉండలేకపోయింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2023, 08:57 AM IST
  • బిగ్ బాస్ షోతో క్రేజ్
  • వరుస ఆఫర్లతో బిజీగా శ్వేతా వర్మ
  • సోషల్ మీడియాకు దూరంగా బ్యూటీ
Swetaa Varma : సోషల్ మీడియాకు దూరంగా శ్వేతా వర్మ.. బిగ్ బాస్ బ్యూటీకి ఏమైందంటే?

Swetaa Varma Detox From Social Media శ్వేతా వర్మ ఎన్ని సినిమాల్లో నటించినా కూడా రాని గుర్తింపు బిగ్ బాస్ షోతో వచ్చింది. చిన్న సినిమాలు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తోన్న శ్వేతా వర్మకు బిగ్ బాస్ ఐదో సీజన్‌కు ఆఫర్ వచ్చింది. ఐదో సీజన్‌లో శ్వేతా వర్మ ఓ మోస్తరుగా ఇమేజ్ సాధించింది. ఆనీ మాస్టర్‌ను అమ్మా అంటూ తిరుగుతూ ఉండేది. ఇక టాస్కులో అయితే శ్వేతా వర్మ బుల్డోజర్‌లా దూసుకుపోయేది. ఆనీ మాస్టర్, శ్వేతా వర్మ ఎమోషనల్‌గా అటాచ్ అయ్యారు.

బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా అదే రిలేషన్‌ను మెయింటైన్ చేస్తున్నారు. టాస్కుల సమయంలో తిట్టుకున్నా, కొట్టుకున్నా కూడా మళ్లీ కలిసిపోయే వారు. అలా ఈ ఇద్దరి ట్రాక్ బాగానే వర్కౌట్ అయింది. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నట్టుగానే బయట కూడా ఎంతో క్లోజ్‌గా ఉంటారు. పార్టీలంటూ తిరుగుతారు. కలిసి మెలిసి ఉంటారు.

అయితే శ్వేతా వర్మ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంటోంది. వరుసగా సినిమాలు చేస్తోంది. శ్వేతా వర్మ ఎన్ని సినిమాలు చేస్తూ ఉన్నా కూడా సరైన హిట్టు మాత్రం రావడం లేదు. పచ్చిస్, మిఠాయి, రాణి వంటి అడపాదడపా చిత్రాలు చేసింది. ఏకమ్ అనే సినిమా పర్వాలేదనిపించింది. నెగెటివ్, సులోచన సమయం ఆసన్నం అంటూ ఇలా ఏవేవో సినిమాల్లో నటించింది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Swetaa Varma (@swetaavarma)

ఇప్పుడు శ్వేతా వర్మ కొంత కాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఫిక్స్ అయింది. ఈ మేరకు ఆమె పోస్టును గమనిస్తే ఏమైనా బిజీగా ఉండటం వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకుందా? లేదా? ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. జూన్ 30 వరకు నేను ఇన్ స్టాగ్రాంను వాడను.. నా టీం ఇకపై నా తరుపున పోస్టులు పెడుతుంది.. రిప్లైలు ఇస్తుంది.. నేను కొంత కాలం బ్రేక్ తీసుకుందామని అనుకుంటున్నాను.. మీ ప్రార్థనలు ఎల్లప్పుడూ నాతోనే ఉంచుకుంటాను..మీరు చూపించే ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటాను అని చెప్పుకొచ్చింది.

Also Read:  Anasuya Holi Photos: అనసూయ ఇంట్లో ఆనందాల హోలీ.. ఫోటోలు

Also Read: Nysa Devgan Photoshoot: సినిమాల్లోకి రాకముందే ఓపెన్ షోతో రెచ్చిపోతున్న స్టార్ కపుల్ డాటర్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News