Bigg Boss Telugu 7 Winner Pallavi Prashanth: ఉల్టా పుల్లా అంటూ ఊహించని ట్విస్టులతో సాగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేతగా కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. 105 రోజులు.. 20 మంది కంటెస్టెంట్స్‌తో ఈ సీజన్ ఆదివారం ఫైనల్ ఎపిసోడ్‌తో ముగిసింది. టాప్-6లో శివాజీ, అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్, అర్జున్ అంబటి, ప్రియాంక, యావర్ నిలవగా.. టాప్-2 పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ నిలిచారు. ఇద్దరు ఫైనలిస్టులతో తీవ్ర ఉత్కంఠ నడుమ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచినట్లు నాగార్జున ప్రకటించారు. రైతు బిడ్డగా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి పల్లవి ప్రశాంత్.. తనదైన ఆటతీరుతో ఆరంభం నుంచే ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకున్నాడు. శివాజీ, యావర్ సాయం తీసుకుంటూనే తన మాటతీరుతో ఇతర కంటెస్టెంట్స్‌కు చెక్ పెట్టాడు. టైటిల్ కోసం చివరి వరకు పోరాడిన అమర్‌దీప్ రెండోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
టాప్-6 నుంచి మొదట అర్జున్ అంబటి ఎలిమినేట్ అయ్యాడు. ఆ తరువాత ప్రియాంక జైన్ ఎలిమినేట్ అయింది. అనంతరం రూ.15 లక్షల ఆఫర్ సూట్‌కేస్‌తో యావర్ బయటకు వచ్చేశాడు. టాప్-3లో శివాజీ, అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్ నిలిచారు. సీజన్ ఆరంభం నుంచి టైటిల్ విన్నింగ్ రేసులో టాప్ ప్లేస్‌లో దూసుకువచ్చిన శివాజీ అనూహ్యంగా మూడోస్థానంలోనే ఎలిమినేట్ అయ్యాడు. ఇది షాకింగ్ ఎలిమినేషన్ అని చెప్పొచ్చు. పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ ఫైనలిస్టులుగా మిగిలారు. హౌస్‌లోకి వెళ్లిన హోస్ట్ నాగార్జున ఇద్దరు ఫైనలిస్టులను స్టేజీ మీదకు తీసుకువచ్చాడు. తీవ్ర ఉత్కంఠ నెలకొనగా.. అందరి టెన్షన్‌కు తెరదించుతూ బిగ్ బాస్ విన్నర్‌గా పల్లవి ప్రశాంత్ పేరును ప్రకటించారు నాగార్జున.
తన పేరును ప్రకటింగానే పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు. వెంటనే నాగార్జున కాళ్లపై పడ్డాడు. అనంతరం నాగార్జున చేతుల మీదుగా బిగ్‌బాస్ ట్రోఫీని అందుకున్నాడు. ఈ సందర్భంగా ప్రశాంత్ తల్లిదండ్రులు సత్యనారాయణ-విజయలక్ష్మిని స్టేజీ మీదకు నాగార్జున పిలిచారు. విజేతగా నిలిచిన ప్రశాంత్‌కు రూ.35 లక్షల చెక్, మారుతీ సుజుకీ హాట్ అండ్ టెకీ బ్రెజ్జా SUV కారు, రూ.15 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ ప్రైజ్‌గా లభించాయి.
తనకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని విన్నింగ్ స్పీచ్ ఇచ్చాడు పల్లవి ప్రశాంత్. తాను ఎన్నో రోజులు పస్తులు ఉన్నానని.. స్టూడియో చుట్టూ తిరిగానని చెప్పుకొచ్చాడు. తన తండ్రి సపోర్ట్‌తోనే తాను బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టానని చెప్పాడు. అనంతరం తనకు వచ్చిన ప్రైజ్‌మనీ రూ.35 లక్షలు రైతులకే ఇస్తానని ప్రకటించాడు. కారును తన బాపుకు, నెక్లెస్ అమ్మకు ఇస్తానన్నాడు. డబ్బులు రైతులకు ఇస్తానని అందరీ హృదయాలను గెలుచుకున్నాడు.
Also Read: Tamil Nadu Road Accident: తమిళనాడులో కారు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ అయ్యప్ప భక్తులు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి