Bigg Boss 5 Ticket To Finale: బిగ్ బాస్ సీజన్-5 టికెట్ టూ ఫినాలే టాస్క్ లో గెలిచేదెవరు?

Bigg Boss 5 Ticket To Finale: బిగ్ బాస్ హౌస్ లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. రెండు వారాల్లో బిగ్ బాస్ రియాలిటీ షో ముగియనున్న నేపథ్యంలో టికెట్ టూ ఫినాలే టాస్క్ ను కంటస్టెంట్స్ మధ్య పెట్టారు. టిక్కెట్ టూ ఫినాలేకు సంబంధించిన రెండో పోటీలో పాల్గొని.. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కంటెస్టెంట్స్ సిద్ధమయ్యారు. ఆ పోటీలో ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 3, 2021, 06:18 PM IST
Bigg Boss 5 Ticket To Finale: బిగ్ బాస్ సీజన్-5 టికెట్ టూ ఫినాలే టాస్క్ లో గెలిచేదెవరు?

Bigg Boss 5 Ticket To Finale: అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్-5 తుది సమరానికి సిద్ధమైంది. ‘టికెట్‌ టు ఫినాలే’లో భాగంగా ఇచ్చిన టాస్క్‌ల్లో విజయం సాధించిన మానస్‌, సన్నీ, సిరి, శ్రీరామ్‌లకు బిగ్‌బాస్‌ తాజాగా ఓ సరికొత్త టాస్క్‌ ఇచ్చాడు. ఆక్యురసీ, మెమొరీ, ఫోకస్‌.. అనే మూడు టాస్క్‌ల్లో నలుగురూ ఏకాభిప్రాయంతో ఒక్కదాన్ని ఎంచుకోవాలని బిగ్‌బాస్‌ సూచించాడు.

దీంతో సన్నీ.. ‘‘మేడమ్‌.. మీరే చెప్పండి’’ అని అడగ్గా.. ‘‘మొమరీ తప్ప ఏదైనా ఓకే’’ అని సిరి సమాధానమిచ్చింది. వెంటనే మానస్ అందుకుని.. ‘‘ఏ ఎందుకని?’’ ప్రశ్నించగా.. ‘‘మీకు ఉంది సర్‌. మాకు లేదు’’ అని ఆమె నవ్వుతూ సమాధానమిచ్చింది. దాంతో సన్నీ.. ‘‘మెమొరీ, ఫోకస్‌ వద్దు ఆక్యురసీకి పోదాం’’ అని అనడం వల్ల.. ‘‘నేను ఆడను. నాకు ఫోకస్‌, మెమొరీ కావాలి’’ అని మానస్‌ సమాధానమిస్తాడు.

దీనిపై స్పందించిన సన్నీ.. ‘‘కాజల్‌తో తిరిగి పెద్ద సైకోలా అవుతున్నావు రా’’ అంటూ సరదాగా కామెంట్‌ చేయడం వల్ల ఇంటిసభ్యులందరూ పగలబడి నవ్వారు. సన్నీ కామెంట్‌తో కాజల్‌ షాక్‌ అవుతుంది. చివరికి వాళ్లందరూ ఫోకస్‌ ఛాలెంజ్‌ ఎంచుకోగా.. బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌తో సన్నీ ఒకింత ఆశ్చర్యపోయాడు.

ఇక, సిరి టాలెంట్‌కి ఇంటిసభ్యులందరూ నవ్వు ఆపుకోలేకపోయారు. ఆ తర్వాత లైట్స్‌ ఆఫ్‌, ఆన్‌ టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఈ టాస్క్‌లో గెలిచిన వారిలో ఇద్దరు టికెట్‌ టు ఫినాలే చివరి గేమ్‌ ఆడతారు.

Also Read: Movie ticket prices : సినిమా టికెట్ల రేట్లను తగ్గించం..ఒమిక్రాన్‌ను ఎదుర్కొంటాం : మంత్రి తలసాని

ALso Read: Pushpa Trailer: సోషల్ మీడియాలో ‘పుష్ప’రాజ్ ట్రెండింగ్.. ఆకట్టుకుంటున్న ట్రైలర్ కట్ పిక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News