BiggBoss Telugu 5: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో ఇంకా రెండు వారాలే మిగిలుంది గ్రాండ్ ఫినాలేకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఈ నేపధ్యంలో బిగ్‌బాస్ టాప్ 5 కంటెస్టెంట్ ఎవరు, ఓటింగ్‌లో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారనే చర్చ విస్తృతంగా కొనసాగుతోంది. ఆ వివరాలు ఇప్పుడు మీ కోసం.
ప్రపంచంలోనే అత్యధిక వ్యూయర్‌షిప్ ఉన్న రియాల్టీ షోగా బిగ్‌బాస్‌కు(BiggBoss)పేరుంది. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో ప్రసారమవుతూ అందర్నీ ఆకట్టుకుంటోంది. తెలుగులో ప్రస్తుతం 5వ సీజన్ నడుస్తోంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలేకు ఇప్పటికే కౌంట్‌డౌన్ ప్రారంభమైపోయింది. ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 5లో 12 వారాలు పూర్తై..13 వారం ప్రారంభమైంది. ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్లు మిగిలారు. ఈ ఏడుగురిలో ఎవరు టాప్ 5లో ఉంటారు, ఎవరు టాప్ 3లో ఉంటారు, ఎవరు విన్నర్‌గా నిలుస్తారనే విషయంపై అంచనాలు మారిపోతున్నాయి.
స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా మారి..టాప్ 5లో(BiggBoss Top 5) కచ్చితంగా ఉంటాడనుకున్న యాంకర్ రవి ఒక్కసారిగా 12వ వారంలో ఎలిమినేట్ కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు..అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ ప్రచారం జరుగుతోంది. 13, 14 వారాల్లో మరో ఇద్దరు ఎలిమినేట్ అవనున్నారు. ఇక చివరివారంలో టాప్ 5 కంటెస్టెంట్లు మిగులుతారు. అందులో ఒకరికి టైటిల్ దక్కుతుంది. డిసెంబర్ 19వ తేదీన జరగనున్న గ్రాండ్ ఫినాలేపై ఇప్పట్నించి అంచనాలు పెరుగుతున్నాయి. ఉన్న ఏడుగురిలో టాప్ 5 ఎవరనే విషయంపై ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడుగురిలో చివరి స్థానంలో ప్రియాంక అలియాస్ పింకి ఉన్నట్టు తెలుస్తోంది. ఫలితంగా వచ్చేవారం కచ్చితంగా పింకీ ఎలిమినేట్ అయ్యేందుకు అవకాశాలు కన్పిస్తున్నాయని సమాచారం. ఇక టాప్ 6 నుంచి కాజల్ లేదా షణ్ముఖ్ లేదా సిరిలలో ఒకరు ఎలిమినేట్ అవుతారని తెలుస్తోంది.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 టైటిల్(BiggBoss Telugu Season 5) గెలవాలంటే ఈ మూడు వారాలే అత్యంత కీలకం. బిగ్‌బాస్ పెట్టే వివిధ రకాల టాస్క్‌లను గెల్చుకోవల్సి ఉంటుంది. టాస్క్‌లలో సామర్ధ్యం నిరూపించుకుంటేనే టాప్ 5 లేదా టాప్ 3లో నిలుస్తారు. ప్రస్తుతం బిగ్‌బాస్ 5లో ఉన్నవారిలో సింగర్ శ్రీరామచంద్ర ఓటింగ్‌లో అగ్రస్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీరామచంద్ర(Sriramachandra) తరువాత సన్నీకు అత్యధికంగా ఓట్లు పోలవుతున్నాయి. ఈ మూడు వారాల్లో ప్రదర్శనను బట్టి టాప్ 5లో ఎవరు మిగులుతారనేది తేలనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook