BiggBoss Telugu5: శ్రీరామ్‌కు హమీద వద్దంటా..బిగ్‌బాస్‌ టైటిల్‌ కావాలట

BiggBossTelugu5 latest episode: ఈ వారం కూడా బిగ్‌బాస్‌హౌజ్‌లో చాలా ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాజా ఎపిసోడ్ ప్రోమో చాలా ఆసక్తికరంగా ఉంది. కొండపొలం టీమ్‌ బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌తో మాట్లాడింది. వైష్ణవ్‌ తేజ్‌, దర్శకుడు క్రిష్‌ ఇవ్వాల్టి ఎపిసోడ్‌లో సందడి చేయనున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 9, 2021, 06:26 PM IST
  • బిగ్‌బాస్‌లో వీకెండ్‌ స్పెషల్
  • బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌తో మాట్లాడిన కొండపొలం టీమ్‌
  • సందడి చేసిన వైష్ణవ్‌ తేజ్‌, దర్శకుడు క్రిష్‌
BiggBoss Telugu5: శ్రీరామ్‌కు హమీద వద్దంటా..బిగ్‌బాస్‌ టైటిల్‌ కావాలట

BiggBossTelugu5 Sriram wants the title of Bigg Boss: బిగ్‌బాస్‌లో ప్రతి వీకెండ్‌లో ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. వారమంతా నామినేషన్స్‌, టాస్క్‌లతో బిజీబిజీగా గడిపే హౌజ్‌మేట్స్‌ను..వీకెండ్స్‌లో నాగార్జున (nagarjuna) మరింత ఉత్సాహపరుస్తుంటారు.. టెన్షన్ కూడా పెడ్తుంటారు. వారం మొత్తంలో హౌస్‌మేట్స్‌ మధ్య జరిగిన గొడవలన్నింటికీ చర్చకు తెస్తారు నాగ్. ఇక ఈ వారం కూడా బిగ్‌బాస్‌హౌజ్‌లో చాలా ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాజా ఎపిసోడ్ ప్రోమో చాలా ఆసక్తికరంగా ఉంది. కొండపొలం (kondapolam) టీమ్‌ బిగ్‌బాస్‌ హౌస్‌మేట్స్‌తో మాట్లాడింది. వైష్ణవ్‌ తేజ్‌ (Vaishnav Tej), దర్శకుడు క్రిష్‌ (krish) ఇవ్వాల్టి ఎపిసోడ్‌లో సందడి చేయనున్నారు.

 

Also Read : MAA Elections 2021 : మా సభ్యులకు వాయిస్‌ మెస్సేజ్‌ పంపిన మోహన్‌బాబు

ఈ సందర్భంగా శ్రీరామ్‌ (Sreeram).. నీకు బిగ్‌బాస్‌ టైటిల్‌ ఇష్టమా? హమీద (hamida) ఇష్టమా? అని నాగార్జున అడిగారు. తనకు బిగ్‌బాస్‌ టైటిలే ఇష్టమంటూ శ్రీరామ్‌ చెప్పారు. ఇది విన్న క్రిష్‌..(krish) తానే శ్రీరామ్‌ ప్లేస్‌లో ఉంటే.. హమీద ముఖ్యం అని చెప్పేవాడిని అన్నారు. ఇక తర్వాత గతవారం జెస్సీ, శ్రీరామ్‌ల మధ్య జరిగిన గొడవపై చర్చించారు నాగార్జున. జెస్సీని తాను కొట్టలేదు అని శ్రీరామ్‌ చెప్పాడు.. అయితే ఈ టాపిక్‌లో కాస్త సస్పెషన్ ఉన్నట్లుంది. ఇక ఎవరు రూలర్.. ఎవరు బానిస అనే గేమ్‌ను కూడా హౌజ్‌మేట్స్‌తో నాగార్జున ఆడించారు.ఇక హౌస్‌లో 9మంది నామినేషన్స్‌లో ఉన్నారు. మరి అందులో నుంచి ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారో తెలియాలంటే బిగ్‌బాస్ (BiggBoss) చూడాలి.

Also Read : Weird Ritual: ఛత్తీస్‌గఢ్‌లో వింత ఆచారం..వరుడికి గిఫ్ట్‌గా 21 విషపూరిత పాములు

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News