Bobby to Direct Ram Charan: టాలీవుడ్ డైరెక్టర్ బాబీ ఇటీవలే వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. పెద్దగా కొత్త కథ కాకుండానే పాత కథతోనే ప్రేక్షకులు ముందు వచ్చిన బాబీ అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి రవితేజ కనిపించినా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో బాబీకి ఇప్పుడు అవకాశాలు క్యూ కడుతున్నాయి. అనేక నిర్మాణ సంస్థల తమతో సినిమా చేయమని ఆయనకు ఆఫర్లు ఇస్తున్నాయి.
అయితే తాజాగా టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబీని రామ్ చరణ్ కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఆ మధ్య ఒక మెగా ఫాన్స్ ఈవెంట్లో బాబీ మాట్లాడుతూ తాను చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా మెగా హీరోతోనే ఉంటుందని కామెంట్ చేయడంతో దాదాపు ఆయన సినిమా రామ్ చరణ్ తోనే ఉంటుందని అందరూ భావిస్తున్నారు.
రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్నాడు. అదే శంకర్ కమలహాసన్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకి కొంత గ్యాప్ లభించింది. ఆ సినిమా పూర్తయిన వెంటనే రామ్ చరణ్ తేజ, బుచ్చిబాబు శానా దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే బాబీ సినిమా అంటే కచ్చితంగా మాస్ మసాలా సబ్జెక్ట్ చేస్తాడని మెగా అభిమానులందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఆర్ఆర్ఆర్ లాంటి ఒక పాన్ ఇండియా మూవీ పాన్ వరల్డ్ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత శంకర్ తో సినిమా చేస్తున్న రామ్ చరణ్ ఆధ్వర్యంలో బుచ్చిబాబుతో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. మళ్ళీ మాస్ మసాలా మూవీ అంటే స్థాయి తగ్గించుకున్నట్టు అవుతుందేమో అని కూడా కొంతమంది ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కానీ అందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఆ ప్రాజెక్ట్ సెట్ అయితే ఈ విషయం మాస్ మసాలా ప్రాజెక్ట్ అవుతుందని కొందరు అనుకునుంటుంటే మరికొందరు మాత్రం ఈ విషయంలో వెనకడుగు వేయడమే బెటర్ అంటున్నారు.
Also Read: Vani Jayaram Death Reason: వాణి జయరాం మృతికి అదే కారణం.. ప్రాధమికంగా నిర్ధారించిన పోలీసులు!
Also Read: Agent Action Scene: మూడు కోట్ల యాక్షన్ సీన్ మటాష్.. చిరు ఇన్ డైరెక్ట్ గా చెప్పింది అదేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.