Agent Action Scene: మూడు కోట్ల యాక్షన్ సీన్ మటాష్.. చిరు ఇన్ డైరెక్ట్ గా చెప్పింది అదేనా?

Action Scene Scrapped in Agent: ఏజెంట్ సినిమాలో మూడు కోట్ల రూపాయల యాక్షన్ సీక్వెన్స్ ఒకదాన్ని స్క్రాప్ చేశారని అంటున్నారు, దీంతో చిరంజీవి గతంలో చేసిన కొన్ని కామెంట్లు వైరల్ అవుతున్నాయి. 

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 9, 2023, 06:30 PM IST
Agent Action Scene: మూడు కోట్ల యాక్షన్ సీన్ మటాష్.. చిరు ఇన్ డైరెక్ట్ గా చెప్పింది అదేనా?

3 Crore Worth Action Scene Scrapped in Agent Movie: ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి తన వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ ఈవెంట్లో మాట్లాడుతూ.. డైరెక్టర్ బాబీని ఒక విషయంలో మెచ్చుకున్నారు. అదేమిటంటే సాధారణంగా సినిమాలు చేసిన తర్వాత మేము అన్ని నిముషాలు కట్ చేశాము, ఇన్ని నిమిషాలు కట్ చేశామని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారని కానీ వాటిని షూట్ చేసేందుకు ఎన్ని కోట్లు ఖర్చు అయ్యాయో ఎవరూ ఆలోచించరని ఈ విషయంలో దర్శకులు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని చురకలంటించారు.

ఆయన చురకలు కొరటాల శివకని అందరు అనుకున్నారు కానీ అసలు విషయం ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. అదేమంటే అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ ఎందుకు అనేక కారణాలతో వెనక్కి వెళుతూ వస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 28వ తేదీ విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తోంది.

తాజాగా టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు సురేందర్ రెడ్డి అఖిల్ సహా మిగతా టీమ్ మెంబర్స్ అందరూ అరేబియాలో ఉన్న మస్కట్ కి వెళుతున్నారని అక్కడ షూటింగ్ జరగబోతుందని తెలుస్తోంది. సుమారు 15 రోజులు పాటు ఒక యాక్షన్ సీక్వెన్స్ అక్కడ షూట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి ఈ యాక్షన్ సీక్వెన్స్ ఇప్పటికే షూట్ చేశారని కాకపోతే సురేందర్ రెడ్డి సహా ఎవరికి నచ్చకపోవడంతో అది మొత్తాన్ని పక్కన పెట్టేసారని అంటున్నారు.

అలా పెట్టినందుకు దాదాపుగా మూడు మూడు కోట్లు నష్టం కూడా కలిగినట్లుగా చెబుతోంది. ఈ సినిమాకి డబ్బులను విరివిగా ఖర్చు పెడుతున్నారు, అఖిల్ చివరి సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్ కావడంతో అఖిల్ ట్రాక్ లోకి వచ్చేసాడు ఇక ఆయన మీద ఎంత పెట్టినా పర్వాలేదని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. మరోపక్క అఖిల్ ఏజెంట్ సినిమాని షారుక్ ఖాన్ పఠాన్ సినిమాతో చాలామంది పోలుస్తున్నారు. అలాగే పటాన్ సినిమా షారుక్ ఖాన్ కెరియర్ లో భారీ బ్లాక్ బస్టర్గా నిలిచిన క్రమంలో అఖిల్ ఏజెంట్ సినిమా కూడా అఖిల్ కెరియర్ లో భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచే అవకాశం ఉందని అంటున్నారు.

అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి వేసిన చురకలు సురేందర్ రెడ్డి మీదనే అని అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో వీరిద్దరూ కలిసి సైరా నరసింహారెడ్డి అనే సినిమా చేశారు చిరంజీవి అప్పుడు కూడా సురేందర్ రెడ్డి ఇలాగే ఏమైనా నష్టం కలిగించి ఉండవచ్చని అదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి తాజాగా చెప్పి ఉండవచ్చని అంటున్నారు. అయితే కొరటాల శివతో మెగాస్టార్ చిరంజీవికి కాస్త దూరం పెరిగినట్లుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన కొరటాల శివ ను ఉద్దేశించే ఈ కామెంట్స్ చేసినట్లుగా భావించారు. కానీ ఇప్పుడు ఏజెంట్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత అందరికీ విషయం అర్ధమైంది.

Also Read: Raashi Khanna Hot Photos: జాకెట్ తీసేస్తూ రాశి ఖన్నా రచ్చ.. ప్రకంపనలు రేపుతున్న బోల్డ్ ఫోటో షూట్!

Also Read: Regina Cassandra Hot Photos: గౌను పైకెత్తి రెజీనా టీజింగ్.. క్లీవేజ్ షోతో రెచ్చిపోయిందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

More Stories

Trending News