Allu Vs Mega Family: ఒకపుడు మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి,పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్.. వగైరా.. వగైరా అందరు ఒకటే కాంపౌండ్. కానీ మధ్యలో అల్లు అర్జున్ తనది మెగా కాంపౌండ్ కాదు. అల్లు కాంపౌండ్ అంటూ కొత్త కుంపటీకి తెర లేపాడు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ను అదే రామ్ చరణ్ అన్ ఫాలో చేసారనే వార్తలు వస్తున్నాయి. నిజంగానే చరణ్.. బన్ని ని అన్ ఫాలో చేసాడా ..? అసలు స్టోరీ విషయానికొస్తే..
Ram Charan Unfollows Allu Arjun In Social Media: తన బావ మరిది, హీరో అల్లు అర్జున్ విషయంలో రామ్ చరణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ను రామ్ చరణ్ అన్‌ఫాలో చేశారు. ఈ వార్త సినీ పరిశ్రమలోనూ.. ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపింది.
Game Changer Pre release event : ఈరోజు అంగరంగ వైభవంగా గేమ్ చేంజర్.. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటెండ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక.. చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయిన మొదటి సినిమా ఈవెంట్ ఇది కావటంతో.. వందలమంది మెగా అభిమానులు ఈవెంట్ కి తరలివచ్చారు. ఈ క్రమంలో ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
Game Changer Pre Release Event Safe Tips: భారీ స్థాయిలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండగా సంధ్య థియేటర్ తొక్కిసలాట మాదిరి కాకుండా పటిష్ట జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే!
Mohan babu vs manchu manoj: మంచు మోహన్ బాబు, మనోజ్ ల వివాదం మొత్తానికి ఇటు రాజకీయాల్లోను, ఇండస్ట్రీలోను.. హాట్ టాపిక్ గా మారిందని విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా.. పోలీసులు మోహన్ బాబుపై హత్యయత్నం కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే.
Mohan Babu vs Chiranjeevi: మంచు మోహన్ బాబు ఇంట ప్రస్తుతం ఫ్యామీలీ గొడవలు రచ్చగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గతంలో మంచు మోహన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మెగా అభిమానులు మరోసారి ట్రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తొంది.
Naga Babu Supports To Allu Arjun Pushpa 2 The Rule Movie: ఆంధ్రప్రదేశ్‌లో పుష్ప 2 సినిమాపై రాజకీయ వివాదం నెలకొంది. అయితే కొందరు ఆ సినిమాను అడ్డుకుంటామని ప్రకటించడంతో నాగబాబు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌కు మద్దతు తెలిపారు.
Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2 ది రూల్’. పుష్ప ది రైజ్ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు విడుదలకు ముందే ఈ సినిమా బాక్సాఫీస్ పరంగా పలు రికార్డులను తిరగరాస్తోంది. ఈ నేపథ్యంలో విడుదలకు ముందు కొంత మంది మెగాభిమానులు పుష్ప 2 బై కాట్ చేయాలంటూ పిలుపునిచ్చారు.
Chiranjeevi Suffers With Chikungunya: సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసింది. ఆయనకు చికెన్ గున్యా సోకిందని ప్రచారం జరుగుతోంది. ఈ వార్త తెలిసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం తమ అభిమాన హీరోకు ఎలా ఉందోనని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
Allu Arjun Pushpa 2: మెగా ఫ్యామిలీ,అల్లు ఫ్యామిలీ మధ్య ఏదో కోల్డ్ వార్.. జరుగుతోంది అన్న రూమర్స్ గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో చెక్కర్ల కొడుతూ ఉన్న.. విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరొకసారి రోడ్డు మీద సింపుల్‌గా వెళ్తున్న అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ ట్రోల్లింగ్ మొదలుపెట్టి ..వైరల్ చేస్తున్నారు.
Konidela Brothers Chiranjeevi Nagababu Pawan Kalyan In Vishwambhara Shoot: చాలా రోజుల తర్వాత కొణిదెల అన్నదమ్ములు ఒక్కచోట కనిపించారు. మెగాబ్రదర్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో మెగా అభిమానులు సంబర పడిపోతున్నారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో పవన్ కల్యాణ్ తన సోదరుడు చిరంజీవిని కలిశాడు. ఎన్నికల్లో తన ఆశీర్వాదం కోరుతూ కలిసినట్లు తెలుస్తోంది. విశ్వంభర షూటింగ్లో బిజీగా ఉన్న చిరంజీవి తన సోదరులు పవన్, నాగబాబు కోసం ప్రత్యేక వీలు చేసుకుని కలవడం విశేషం.
Megastar Chiranjeevi : మెగాస్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా విశ్వంభర. చాలా రోజుల తరువాత చిరంజీవి సోషియో ఫాంటసీ సినిమా చేస్తూ ఉండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా గురించి తెలుస్తున్న ఒక వార్త మరిన్ని అంచనాలను పెంచేస్తోంది.
Vishwambhara: ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో హిట్ సినిమాల కంటే డిజాస్టర్ సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకదాని తర్వాత మరొక డిజాస్టర్ తో సతమతమవుతున్న చిరంజీవి సోలో హిట్ గురించి పట్టించుకోకుండా తన సినిమాల కోసం స్టార్ నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారని కొందరు నెటిజన్లు వాదిస్తున్నారు.
Game Changer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గురించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక దీపావళి సందర్భంగా సినిమాకి సంబంధించిన ఒక పెద్ద అప్డేట్ కూడా వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ ఈసారి కూడా శంకర్ కారణంగా మెగా అభిమానులకి కేవలం నిరాశ మాత్రమే మిగిలింది అని తెలుస్తోంది.
Ustaad Bhagath Singh: ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా గురించి ప్రకటించి చాలా కాలం గడిచింది కానీ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా పూర్తి కాలేదు. తాజా సమాచారం ప్రకారం హరీష్ శంకర్ ఇప్పుడు ఈ సినిమాని కొన్నాళ్ళ పాటు పక్కన పెట్టేసి వేరే సినిమాల గురించి ఆలోచించాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
Varun and Lavanya: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, స్టార్ బ్యూటీ లావణ్య త్రిపాఠీల పెళ్లి నవంబర్ 1న ఇటలీ లో అంగరంగ వైభవంగా జరిగింది. మెగా కుటుంబ సభ్యులతో పాటు అల్లు కుటుంబ సభ్యులకు కూడా ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా జంట తిరిగి హైదరాబాద్ వచ్చాక నిన్న మిగతా వారందరికీ మెగా కుటుంబం ఒక పెద్ద రిసెప్షన్ అరేంజ్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
Wedding Celebration : వరుణ్ తేజ్ మరియు హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఈ మధ్యనే నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట ఇప్పుడు పెళ్లికి సిద్ధం అయింది. వీరి పెళ్లి ఇటలీలో నంబర్ 1వ తేదీన అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటినుంచే మెగా ఇంట్లో పెళ్లి హడావిడి మొదలైపోయింది.
Megastar Chiranjeevi : కమర్షియల్ సినిమాలకి దూరంగా ఉండాలి అని నిర్ణయించుకున్న మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇప్పుడు మెగా 156 సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు చెప్పుకోవచ్చు. తాజాగా ఈ సినిమా మూడు లోకాల నేపథ్యంలో సాగుతుందని మూడు జోనర్లు ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తోంది.
Ram Charan Birthday Wishes to Allu Arjun రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మెగా, అల్లు వారి మధ్య ఉన్న గ్యాప్ అందరికీ అర్థమైంది. రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా బన్నీ స్పందించలేదు. కనీసం ఒక్క ట్వీట్ కూడా అలా ఫార్మాలిటికి కూడా వేయలేదు
Allu Arjun Tweet Cause Fan War Between NTR and Ram Charan Fans : ఎన్టీఆర్ తెలుగు ప్రైడ్ అంటూ బన్నీ వేసిన ట్వీట్ ప్రభావం ఇంకా చూపిస్తోంది. తెలుగు ప్రైడ్ మా వాడంటే మా వాడంటూ మెగా నందమూరి అభిమాబనులు ట్విట్టర్లో హంగామా చేస్తున్నారు. అయితే ఇప్పుడు మరోసారి ఈ వార్ నేషనల్ లెవెల్‌కు చేరింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.