Arbaz Khan: మరో తెలుగు క్రేజీ ప్రాజెక్ట్‌తో రీ ఎంట్రీ ఇస్తున్న సల్మాన్ సోదరుడు ఆర్బాజ్..

Arbaz Khan: బాలీవుడ్ నటుడు ఆర్భాజ్ ఖాన్ హిందీ సినిమాలతోనే కాదు.. తెలుగు సినిమాల్లో సత్తా చాటాడు. అప్పట్లో చిరంజీవి హీరోగా నటించిన 'జై చిరంజీవా'లో విలన్‌గా నటించాడు. ఇపుడు ఆ తర్వాత మరో తెలుగు సినిమాలో నటించాడు. తాజాగా మరో టాలీవుడ్ మూవీతో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 31, 2024, 08:28 AM IST
Arbaz Khan: మరో తెలుగు క్రేజీ ప్రాజెక్ట్‌తో రీ ఎంట్రీ ఇస్తున్న సల్మాన్ సోదరుడు ఆర్బాజ్..

Arbaz Khan: బాలీవుడ్ నటుడు ఆర్భాజ్ ఖాన్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. సల్మాన్ తమ్ముడిగా బీటౌన్క్షలో కెరీర్ స్టార్ట్ చేసినా.. హీరోగా పెద్దగా రాణించలేకపోయాడు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా విలన్‌గా హిందీలో సత్తా చూపిస్తున్నాడు. ఈయన తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన జై చిరంజీవా సినిమాలో విలన్‌గా నటించాడు. ఆ తర్వాత రాజ్ తరుణ్ హీరోగా నటించిన 'కిట్టూగాడు' సినిమాలో నటించాడు. అటు మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన 'బిగ్ బ్రదర్'లో ముఖ్యపాత్రలో నటించాడు. తాజాగా మరో తెలుగు సినిమాకు సైన్ చేసాడు.

యంగ్ హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 1 చిత్రంలో యాక్ట్ చేయడానికి సైన్ చేసాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తాజాగా  బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ అడుగు పెట్టారు.

చాలా యేళ్ల  తరువాత మళ్ళీ ఒక తెలుగు చిత్రంలో నటించడం ఆనందంగా ఉందన్నారు ఆర్భాజ్.  గంగా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ 1 లో తెరకెక్కుతున్న ఒక డిఫరెంట్ కథలోని భాగం కావడం ఆనందంగా ఉందన్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. అశ్విన్ బాబు హీరోగా ఒక వైవిధ్యమైన కథతో తెరకెక్కుతున్న సినిమా ఇది. మా సంస్థ గంగా ఎంటర్టైన్మంట్స్ మొదటి నిర్మాణంలోనే అర్బాజ్ ఖాన్‌తో పని చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. కొత్త కథ, కథనాలతో రూపొందుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది.

ఆర్బాజ్  పాత్ర అద్భుతంగా ఉంటుందన్నారు. త్వరలో  ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్ తో ఆయన సెట్స్ లోకి అడుగు పెడతారు. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో సినిమా చేస్తున్నామన్నారు.  మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. ఈ మూవీలో అశ్విన్ బాబు సరసన దిగంగనా సూర్యవంశీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో 'హైపర్' ఆది, తమిళ నటుడు సాయి ధీన ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

Also Read: Four Working Days: ఉద్యోగులకు శుభవార్త.. ఇక కేవలం నాలుగంటే 4 రోజులు పని చేస్తే చాలు

Also Read: PM Kisan Budget 2024: రైతులకు ప్రధాని మోదీ భారీ కానుక.. బడ్జెట్‌లో తీపి కబురు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News