బాలీవుడ్ బాద్ షా, బిగ్ బి గా ప్రాచుర్యం పొందిన అమితాబ్ బచ్చన్ అంటే ఇప్పటికీ అందరికీ అభిమానం, క్రేజ్. 80వ ఏట కూడా యాక్టివ్‌గా ఉంటున్న బిగ్ బి అమితాబ్‌కు ముందుగా పుట్టిన రోజు శుభాకాంక్షలు. అక్టోబర్ 11న 80వ పుట్టిన రోజు జరుపుకుంటున్న అమితాబ్ బచ్చన్..ఇవాళ కూడా 40లో ఉన్నట్టే ఫిట్‌గా ఉంటున్నారు. ఈ వయస్సులో కూడా అంత ఫిట్నెస్, యాక్టివ్నెస్ ఎలా సాధ్యం..
దాదాపు 50 ఏళ్లుగా బాలీవుడ్ స్క్రీన్‌పై సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్న అమితాబ్ బచ్చన్‌కు ఇప్పుడు కూడా పెద్దఎత్తున సినిమా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. మరోవైపు కౌన్ బనేగా క్రోర్‌పతి కార్యక్రమంతో బిజీ, ఇంకోవైపు భారీగా వాణిజ్య ప్రకటనలు. క్షణం తీరిక లేకుండా గడుపుతూనే ఉల్లాసంగా ఉంటున్నారు. ఇంత యాక్టివ్‌గా , ఫిట్‌గా ఎలా ఉంటున్నారు అసలు..
జీవితంలో చేసిన సంఘర్షణ
బిగ్ బి హోదా అమితాబ్ బచ్చన్‌కు ఆషామాషీగా రాలేదు. జీవితంలో ఎన్నో సమస్యల్ని ఎదుర్కొన్నారు. ఆర్ధికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొని..అందులోంచే తిరిగి పైకి లేచారు. టీబీ, లివర్ సిరోసిస్ వంటి వ్యాధులు చుట్టుముట్టినా మొక్కవోని ధైర్యంతో ఎదుర్కొన్నారు. లివర్ సిరోసిస్ కారణంగా 75 శాతం లివర్ దెబ్బతింది. 2019లో కరోనా మహమ్మారిని కూడా ఎదుర్కొన్నారు. అమితాబ్ బచ్చన్‌కు Myasthenia gravis Auto immune Disease ఉండటం వల్ల ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది ఎప్పుడూ.
సిగరెట్, మద్యం అలవాట్లకు దూరం
బిగ్ బి ఆరోగ్యం కోసం చాలా నిష్టగా ఉంటారు. ముఖ్యంగా మద్యం, సిగరెట్ అలవాట్లకు దూరం పాటిస్తారు. ఉదయం, రాత్రి సమయాల్లో సాధారణ భోజనం తినడం అమితాబ్‌కు ఇష్టం. ఇక రోజూ ఉదయం వర్కవుట్స్, యోగా చేస్తారు. రోజుకు 20 నిమిషాలు వాకింగ్ క్రమం తప్పకుండా చేస్తారు.
అమితాబ్ డైట్లో ఏముంటాయి
బిగ్ బి అమితాబ్ బచ్చన్ భోజనం చాలా సింపుల్‌గా ఉంటుంది. వర్కవుట్, యోగాతో దినచర్య ప్రారంభిస్తారు. ఆ తరువాత పండ్లు, డ్రైఫ్రూట్స్ తింటారు. బ్రేక్‌ఫాస్ట్‌లో ఎగ్భుర్జి, దలియా, బాదం, ప్రోటీన్ డ్రింక్ తీసుకుంటారు. బ్రేక్‌ఫాస్ట్ అనంతరం కొన్ని మందులు, తులసి ఆకుల నీళ్లు, ఉసిరి జ్యూస్, కొబ్బరి నీళ్లు తప్పకుండా ఉండాల్సిందే. మద్యాహ్నం భోజనంలో పప్పు, కూరగాయలు, రోటీ ఉంటాయి. ఇక రాత్రి డిన్నర్లో పన్నీర్ భుర్జి లేదా సూప్ తీసుకుంటారు. బెంగాలీ స్వీట్స్ అంటే ఆయనకు చాలా ఇష్టం.
Also read: Rahul Koli Dies: ఆస్కార్ రేసులో ఉన్న 'ఛెల్లో షో' సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ మృతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook