"పద్మావతి" చిత్రానికి బాలీవుడ్ అండ

పద్మావతి చిత్రాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేయడం అనేది.. ఒక భావప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తూ.. అందుకు నిరసనగా ఆదివారం 15 నిమిషాల పాటు అన్ని సినిమాల షూటింగ్‌‌‌లు నిలిపివేయాలని సినీ సంఘాలు భావించాయి.

Last Updated : Nov 26, 2017, 12:11 PM IST
"పద్మావతి" చిత్రానికి బాలీవుడ్ అండ

ఇటీవలి కాలంలో పలు వివాదాలకు కేంద్రబిందువుగా మారిన  'పద్మావతి' చిత్రానికి బాలీవుడ్ సినిమా పరిశ్రమ అండగా నిలిచింది. పద్మావతి చిత్రాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేయడం అనేది.. ఒక భావప్రకటనా స్వేచ్ఛపై జరుగుతున్న దాడిగా అభివర్ణిస్తూ.. అందుకు నిరసనగా ఆదివారం 15 నిమిషాల పాటు అన్ని సినిమాల షూటింగ్‌‌‌లు నిలిపివేయాలని ఇండియన్ ఫిల్మ్స్ అండ్ టివి డైరెక్టర్స్ అసోసియేషన్ (ఐఎఫ్‌టిడిఎ) తో పాటు దాదాపు 20 సినీ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. 

దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని స్టూడియోల్లో  15 నిముషాలు విద్యుత్ ఆపేసి 'నాకు స్వేచ్ఛ వుందా?' అనే పేరుతో ఉన్న ప్లకార్డులు పట్టుకొని. మధ్యాహ్నం గం.04:15నిల నుంచి గం.04:30నిల వరకు సినీ సంఘాలు అన్నీ కూడా వినూత్న రీతిలో నిరసన తెలపడానికి నిశ్చయించుకున్నాయి. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పద్మావతి చిత్రం ఇంకా సెన్సార్ అవ్వలేదు. 

Trending News